గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 24, 2020 , 00:46:00

టీఆర్‌ఎస్‌తోనే మాకు న్యాయం

టీఆర్‌ఎస్‌తోనే మాకు న్యాయం

ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామస్తులు

సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి హామీ

తొగుట :  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరుగుతుందని మల్లన్నసాగర్‌ నిర్వాసితులైన తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామస్తులు స్పష్టం చేశారు. ఎన్నికల వేళ వచ్చి, మాయమాటలు చెప్పి, తర్వాత మాయమయ్యే నాయకులపై తమకు నమ్మకం లేదన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ప్రైవేటు ఫంక్షన్‌లో ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామస్తులతో మంత్రి హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు. 90శాతం వరకు సమస్యలు పరిష్కరించారని, మిగతావి కూడా పూర్తి చేయాలని మంత్రి దృష్టికి తేగా, పరిష్కరిస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, సర్పంచ్‌ ప్రతాప్‌రెడ్డి, ఎంపీటీసీ కనకలక్ష్మి  పాల్గొన్నారు.

 గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం : మంత్రి 

ముంపు బాధితుల త్యాగాలు మరువలేనివని, వారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని మంత్రి హరీశ్‌రావు హామీనిచ్చారు. గత ప్రభుత్వాలు ముంపు బాధితులకు అన్యాయం చేశాయని, నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ముంపు బాధితులకు 250 గజాల స్థలంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి, అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు. 90శాతం వరకు ముంపు గ్రామాల వారి సమస్యలు పరిష్కరించామని, మిగతావి కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొండపోచమ్మ తరహాలో మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. 

VIDEOS

logo