ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న సర్కారు

ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
దౌల్తాబాద్: నిరుపేద ప్రజల కోసం నిరంతరం పాటు పడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు అని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గొడుగుపల్లి, లింగాయిపల్లి తండా గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు భారీ మెజార్టీ అందజేయాలని ఓటర్లను కోరారు. కార్యక్రంలో సర్పంచ్‌లు శివకుమార్, దేవియాదగిరి, పార్టీ మండలాధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, మండల పరిధిలోని మల్లేశంపల్లి, ముబారాస్పూర్ గ్రామాల్లో టీఆర్ఎస్వీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేశ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిసేట సుజాత తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. ఆయన వెంటన మల్లేశంపల్లి సర్పంచ్ దారా సత్యనారాయణ, నాయకులు ఉన్నారు. ఉప్పరపల్లిలో సర్పంచ్ చిత్తారిగౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ యువత తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అక్కా వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త
- ఈ రాశుల వారికి.. వ్యయ, ప్రయాసలు అధికం!
- 28 ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు
- టీకా ఇచ్చి అభయం కల్పించి..
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!