సోమవారం 08 మార్చి 2021
Siddipet - Oct 24, 2020 , 00:22:16

నేడు బతుకమ్మ పండుగ

నేడు బతుకమ్మ పండుగ

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తన్నీరు హరీశ్‌రావు, 

సిద్దిపేట సీపీ జోయల్‌ డెవిస్‌ 

సిద్దిపేట కలెక్టరేట్‌/సిద్దిపేట టౌన్‌:  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా నిర్వహించుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలోనే పూలను పూజించి.. ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. గోదావరి జలాలతో బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటామన్న మాటను నిజం చేశామన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్న చెరువుల వద్ద బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చెరువులు, ట్యాంకర్లతో నీళ్లు నింపి బతుకమ్మలు వేసే పరిస్థితి ఉండేదన్నారు. కానీ, నేడు సీఎం కేసీఆర్‌ కృషితో కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండుకుండల్లా మారాయని ఆనందం వ్యక్తంచేశారు.   సిద్దిపేట జిల్లా ప్రజలకు సీపీ  జోయల్‌ డెవిస్‌ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ పండుగలను ప్రజలందరూ సంతోషంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ ముందుకు వెళ్లాలని సూచించారు.  


VIDEOS

logo