ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Oct 23, 2020 , 01:14:53

నూతనోత్సాహం

నూతనోత్సాహం

  • దుబ్బాకలో సంఘీభావ ర్యాలీ విజయవంతం
  • సుజాతకు మద్దతు తెలిపిన మహిళా లోకం
  • రెట్టించిన ఉత్సాహంలోగులాబీ దళం
  • పుట్టెడు దుఃఖంతో వచ్చిన ఆడబిడ్డకు తోడుగా నిలిచిన  మహిళలు
  • గడపగడపకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : దుబ్బాక ఉప ఎన్నికకు సమ యం దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్ర చారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజా త ప్రచారంలో మరింతగా దూసుకపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో ప్రచారం పూర్తి చేశారు. బుధవారం దుబ్బాక పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా మహిళలు పెద్ద ఎత్తున నిర్వహించిన సంఘీభావ ర్యాలీ విజయవంతం అయ్యింది. ఒక దుబ్బాక మండలం నుంచి మహిళలు పెద్ద ఎత్తు న తరలిరావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిం ది. దీంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో శ్రేణులు పని చేస్తున్నారు. ఈ మండలంలో ఎక్కువగా బీడీ కార్మికులుండగా, వా రంతా ర్యాలీ లో పాల్గొని సుజాతకు మద్దతు తెలిపారు. ‘పుట్టెడు దుఃఖంతో మా ముందుకు వచ్చిన మా ఇంటి ఆడపడుచుకు మే మంతా అండగా ఉంటాం’.. అని ముక్తకంఠంతో నినదించారు.ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా సీఎం కేసీఆర్‌ తమకు రూ.2,016 పింఛన్‌ ఇస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా బీడీ కార్మికులు ఇంటింటికీ తిరిగి, ‘మనకు పింఛన్లు ఇస్తున్నది.. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దుబ్బాకలో పుట్టి, పెరిగి, ఇక్కడే చదువుకున్నారు.. మనల్ని గోల్‌మాల్‌ చేయడానికి బీజేపోళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. వారి మాటలను నమ్మవద్దు’.. అంటూ బీడీ కార్మికులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. దుబ్బాక ని యోజకవర్గంలో మొత్తం 52,823 మందికి అన్ని రకాల పింఛ న్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని, తమ ఇంటి పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్‌ నిలిచారని పింఛన్ల లబ్ధిదారులు అంటున్నారు. పేదింట ఆడపిల్ల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి పథకం కింద 5,599మంది, షాదీముబారక్‌ కింద 322 మందికి చెక్కులు అందించిన ప్రభుత్వం ఆదుకున్నదన్న విషయాన్ని వివరిస్తున్నా రు. ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్‌ స్థాయికి మార్చి, మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నదని చెబుతున్నారు. ప్రసవానికి ప్రభుత్వ దవాఖానకు వెళితే రూపాయి ఖర్చు లేకుండా ప్రసవం చేసి, కేసీఆర్‌ కిట్టుతో పాటు మగపిల్లాడు పుడితే రూ.12వేలు, ఆడపిల్ల పుడితే రూ.13వేలను సర్కారు ఇస్తున్నదని వివరిస్తున్నారు. ని యోజకవర్గంలో కేసీఆర్‌ కిట్టు కింద 29,083మంది లబ్ధిపొందారని చె బుతున్నారు. ఇవన్నీ చేసిన వాళ్లకు కాకుండా ఓట్ల కోసం వచ్చే వాళ్లకు ఎలా ఓట్లు వేస్తామంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. పుట్టె డు దుఃఖంలో ఉన్న సోలిపేట సుజాతను చూసి మీటింగ్‌కు వచ్చి న మహిళలు కంట తడిపెట్టడం కనిపించింది.

టీఆర్‌ఎస్‌కు కంచుకోట.. దుబ్బాక

పార్టీ ఆవిర్భావం నుంచి దుబ్బాక టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఐదుసార్లు పోటీ చేసి, నాలుగు సార్లు ఘన విజయం సాధించారు. గత సాధారణ ఎన్నికల్లో 62వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో రాష్ట్రంలోనే ఏడో స్థానంలో నిలిచారు. అనారోగ్యం కారణంతో రామలింగారెడ్డి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సీఎం కేసీఆర్‌ రామలింగారెడ్డి సతీమణి సుజాతను ఎన్నికల బరి లో నిలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు నేతృత్వంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో కలిసి పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రచారా న్ని నిర్వహిస్తున్నారు. ప్రతి మండలం కేంద్రంలో రోడ్‌షో నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే దుబ్బాక పట్టణంలో నిర్వహించిన రోడ్‌షో గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. ప్రతి గ్రామంలో పటిష్టమైన క్యాడర్‌ ఉంది. ఆయా గ్రామాల్లోని పార్టీ బూత్‌కన్వీనర్లు, ప్రతి 100మందికి ఒక ఇన్‌చార్జిని నియమించి, ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, దుబ్బాకలో చేపట్టిన అభివృద్ధి పనులు గడపగడపకూ తీసుకెళ్లి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో పింఛన్లు ఇస్తున్న విషయాన్ని గులాబీ సైనికులు వివరిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో రూ.800 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందించి, ప్రజల నీటి గోసను తీర్చిందని, వచ్చే ఏడాదిలోగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ప్రతీ ఎకరాకు రానున్నాయని వివరిస్తున్నారు. ఇప్పటికే తొగుట, దుబ్బాక మండలాల్లోని కొన్ని చెరువులను గోదావరి జలాలతో నింపిందని, ప్రధానకాల్వల నిర్మాణంతో పాటు పిల్ల కాల్వల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. రైతుబంధు పథకం కింద 76,912 మంది రైతులకు గానూ రూ.77కోట్ల60లక్షల 01వెయ్యి 852 ఈ వానకాలంలో పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించి రైతుకు ఆసరాగా నిలిచిందన్నారు. ఏ కారణం చేతనైనా రైతు మృతి చెందితే, రైతుబీమా కింద బాధిత కుటుంబానికి రూ.5లక్షలు అందిస్తూ భరోసా ఇస్తున్నదని వివరిస్తున్నారు. చేనేత, బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు అందిస్తున్నదని, రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం నియోజకవర్గ ప్రజలకు అందేలా చూడడంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు.

VIDEOS

logo