సోమవారం 08 మార్చి 2021
Siddipet - Oct 23, 2020 , 01:14:53

అభివృద్ధికే పట్టం

అభివృద్ధికే పట్టం

సిద్దిపేట కలెక్టరేట్‌ : అభివృద్ధికే పట్టం కడుతామని, సంక్షేమానికే ఓటు వేస్తామని దుబ్బాక నియోజకవర్గంలోని యువకులు స్పష్టం చేశారు. గురువారం సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు ని వాసంలో తొగుట మండలం ఘనపూర్‌, దౌల్తాబాద్‌ మండలం శేరుపల్లి, బందారం, నర్సంపేట గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రావు కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీవి అబద్ధాల మాటలు.. అసత్య ప్రచారాలన్నారు. బీజేపీ తప్పుడు ప్రచారాలు, మోసపూరిత మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌కు అపూర్వ స్పందన వస్తున్నదన్నారు. రాబోయే రోజుల్లో తొగుట మండలం మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుతో సస్యశ్యామలం కాబోతుందని, అది కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే జరుగుతుందన్నారు. ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుపడ్డ వారు ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నారన్నారు.

VIDEOS

logo