మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Oct 23, 2020 , 01:14:51

సరస్వతీ నమోస్తుతే..

 సరస్వతీ నమోస్తుతే..

పాపన్నపేట : జగజ్జనని ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల ఆరో రోజైన గురువారం చదువుల తల్లి సరస్వతీ మాత (కాత్యాయనిదేవి) తెలుపు రంగు పట్టువస్ర్తాలలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున  అర్చకులు రాజగోపురంలోని ఉత్సవ విగ్రహాన్ని కాత్యాయనీ దేవిగా అలంకరించారు. అనంతరం గోకుల్‌షెడ్‌లో అమ్మవారిని తెలుపు రంగు పట్టువస్ర్తాలు, వీణ వాహిణిగా అలంకరించి, చండీ ఉపాసకులు సనాతన శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, లక్ష్మి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొని కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాపన్నపేట సర్పంచ్‌ గురుమూర్తిగౌడ్‌, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సరస్వతీమాతగా దర్శనమిచ్చిన వనదుర్గాదేవిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈవో సార శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది సూర్య శ్రీనివాస్‌, ప్రతాప్‌రెడ్డి,లక్ష్మీనారాయణ, మధుసూదన్‌రెడ్డి,మహేశ్‌ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 

నేడు కాళరాత్రిదేవి(మహాలక్ష్మిదేవి)గా..

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం ఏడుపాయల వనదుర్గాభవానీ మాతకు బోనాలు తీసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గతంలో 111బోనాలు తీసేవారు. కానీ, కరోనా నేపథ్యంలో ఈసారి తక్కువ మందితో బోనాలు తీశారు. ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి సతీమణి లక్ష్మీ బోనం తీశారు. గోకుల్‌షెడ్‌ నుంచి రాజగోపురం వరకు బోనాలు తీశారు. అంతకు ముందు ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, లక్ష్మి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.  కుంకుమార్చన అనంతరం దుర్గామాత ఆలయం ముందు నుంచి ప్రవహిస్తున్న గంగామాతకు ఎమ్మెల్సీ దంపతులు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ వెంట రైతు సమన్వయ సమితి జిల్లా మండల అధ్యక్షులు తాడేపు సోములు, గడీల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పుల్లన్నగారి ప్రశాంత్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కుమ్మరి జగన్‌, కొత్తపల్లి సొసైటీ చైర్మన్‌ రమేశ్‌, ఏడుపాయల మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, నాగాపూర్‌ సర్పంచ్‌ ఒంటరి రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

VIDEOS

logo