కొండపోచమ్మ సాగర్ బాగుంది..

మర్కూక్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అద్భుతమని కేంద్ర బృందం సభ్యులు ఆర్బీ కౌల్, మనోహరన్ కొనియాడారు. గురువారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో పంట నష్టం జరిగిన క్షేత్రాలను పరిశీలించిన అనంతరం, సమీపంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ పంప్‌హౌస్‌ను సభ్యులు ఆర్బీ కౌల్, మనోహరన్ రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ప్రత్యేకతను కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి వారికి వివరించారు. కేవలం మూడేండ్లలోనే రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం అని కలెక్టర్ వారికి తెలిపారు. సముద్ర మట్టానికి వంద మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి 624 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణలో సిద్దిపేటతో సహా తొమ్మిది జిల్లాలు లబ్ధి పొందనున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామన్నారు. భూసేకరణ తక్కువ సమయంలో పూర్తి చేశామన్నారు. వచ్చే మూడున్నర ఏండ్లలో అంతర్గత కాల్వల నిర్మాణం చేపట్టి , సిద్దిపేట జిల్లాలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణంతో సాగునీటి లభ్యత పెరిగిందన్నారు. హైదరాబాద్‌కు సైతం తాగునీటి సౌకర్యం కల్గిందన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రాజెక్టల నిర్మాణంతో పాటు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, మద్దతు ధరతో పాటు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తుందని బృందానికి తెలిపారు. కొండపోచమ్మ సాగర్ పంప్‌హౌస్‌తో పాటు జలాశయాన్ని వీక్షించిన కేంద్ర బృందం సభ్యులు, ఈ ప్రాజెక్ట్ సాగునీటి రంగంలోనే గొప్ప ఆవిష్కరణగా, ఇంజినీరింగ్ మార్వలేస్ అంటూ అభివర్ణించారు.
తాజావార్తలు
- బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
- శర్వానంద్‌కు మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు