బుధవారం 25 నవంబర్ 2020
Siddipet - Oct 22, 2020 , 00:36:59

టీఆర్‌ఎస్‌కు లక్ష మెజార్టీ ఖాయం

టీఆర్‌ఎస్‌కు లక్ష మెజార్టీ ఖాయం

జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు 

రాయపోల్‌: దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు లక్ష మెజార్టీ ఖాయమని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మణిక్‌రావు అన్నారు. బుధవారం మండలంలోని మంతూర్‌ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో దృష్టి సారించిందన్నారు. సీఎం కేసీఆర్‌ నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతు ఖాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించి ఢిల్లీ పెద్దలకు గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకట్‌రాంరెడ్డి, ఉమ్మడి మండల సొసైటీ వైస్‌ చైర్మన్‌ రవీందర్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు పర్వేజ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పాల రామాగౌడ్‌, నాయకులు ఇప్ప దయాకర్‌, నర్సారెడ్డి, బాగిరెడ్డి, విష్ణన్‌వర్ధర్‌రెడ్డి, మల్లేశం గ్రామ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జోరందుకున్న ప్రచారం 

టీఆర్‌ఎస్‌ నాయకులు మండలంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం తిమ్మక్కపల్లి గ్రామంలో గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌, జడ్పీటీసీ యాదగిరి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటా తిరుగుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను గెలిపించాలని ఓటర్లకు విజ్ఙప్తి చేశారు. మండలోని గొల్లపల్లి, ఉదాయపూర్‌ గ్రామాల్లో గజ్వేల్‌ మున్సిపల్‌ మజీ వైస్‌ చైర్మన్‌ దుంబాల అరుణ భూపాల్‌రెడ్డి  ఇంటింటా ప్రచారం చేశారు. 

అభివృద్ధిని చూసి ఓటేయండి 

చేగుంట: అభివృద్ధి చూసి ఓటేయ్యాలని మండల ఇన్‌చార్జి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. చేగుంటలోని పలు వీధుల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బుధవారం పర్యటించి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి బలపర్చిన అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలుపించాలని  ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్‌, గొర్రె వెంకట్‌రెడ్డి, స్వర్గం సిద్ధిరాములు, దాసోజు వీరబ్రహ్మం, దుర్గం అనిల్‌, బుడ్డ భాగ్యరాజ్‌ పాల్గొన్నారు.