బుధవారం 25 నవంబర్ 2020
Siddipet - Oct 22, 2020 , 00:36:59

భారీ మెజార్టీ లక్ష్యంగా పనిచేయాలి

భారీ మెజార్టీ లక్ష్యంగా పనిచేయాలి

అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌

తొగుట: మెజార్టీ లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని అందోల్‌ ఎమ్మెల్యే, తొగుట మండల ఎన్నికల ఇన్‌చార్జి చంటి క్రాంతి కిరణ్‌ పేర్కొన్నారు. మండలంలోని చందాపూర్‌ గ్రామంలో బుధవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.  బీజేపీ, కాంగ్రెస్‌ పరిపాలిస్తున్న రాష్ర్టాల్లో ఎం దుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు గ్లోబల్స్‌ ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా నామమాత్రమేనన్నారు. బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయడం అంటే మోటర్లకు మీటర్లు బిగించడానికి ఒప్పుకున్నట్లే అవుతుందన్నారు. పన్నుల రూపంలో పెద్దఎత్తున లబ్ధిపొందుతున్న కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల్లో కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామన్నారు. దుబ్బాకలో 60వేల మం దికి పింఛన్లు, 78 వేల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నట్లు చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. నాడు కరెంట్‌ ఉంటే వార్త అయ్యేదని, నేడు కరెంట్‌ పోతే వార్త అవుతుందని, 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఘనత  దక్కుతుందన్నారు. గతంలో ఎరువులు, విత్తనాలకోసం గోస పడ్డామని, నేడు కష్టాలు తీరాయన్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి హయాంలో దుబ్బాక నియోజకవర్గంలో 2500 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించినట్లు తెలిపారు. 18 విద్యుత్‌సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  సుజాతను గెలిపిస్తే దుబ్బాకను అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బొడ్డు నర్సింహులు, మాజీ సర్పంచ్‌లు సిరిసిల్ల భాస్కర్‌, మల్లేశం, నాయకులు కుమార్‌, సుభాష్‌గౌడ్‌, ధర్మయ్య, భూమయ్య పాల్గొన్నారు.