శనివారం 05 డిసెంబర్ 2020
Siddipet - Oct 22, 2020 , 00:36:59

మంత్రి హరీశ్‌రావు సమక్షంలో చేరికలు

మంత్రి హరీశ్‌రావు సమక్షంలో చేరికలు

-టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు 

రాయపోల్‌: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేశారు. దుంబాల రామచంద్రం, ఎర్రోల మల్లయ్య, బాగాయ్య, నాంసాని దుర్గయ్య, రాజయ్య, చిన్న ఆంజనేయులు, రాజరాం శ్రీనివాస్‌, ఎక్కల అయ్యల్లం, కిచుగారి అంజయ్య, కల్లూరి కనుకయ్య, మన్నె చంద్రం తదితరులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో ప్రయోజనం చేకురుతున్నాయని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు పేర్కొన్నారు.  కార్యక్రమంలో గ్రామ ఎన్నికల ఇన్‌చార్జి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కళ్యాణాకర్‌ నర్సింగ్‌రావు, ఉప సర్పంచ్‌ మల్లేశం, నాయకులు కల్లూరి శ్రీనివాస్‌, నాయకులు సత్యం, ఆంజనేయులు, యాదగిరి, మధు, బాల్‌రాజ్‌, స్వామి పాల్గొన్నారు.