గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 21, 2020 , 00:31:42

మహిళలే కీలకం.. మహిళలదే పైచేయి..

మహిళలే కీలకం.. మహిళలదే పైచేయి..

దుబ్బాక నియోజకవర్గంలో మహిళా   ఓటర్లే ఎక్కువ 

సెగ్మెంట్‌లో మొత్తం 1,98,807 ఓట్లు 

పురుషులు 98,028, మహిళలు 1,00,779

మహిళా ఓట్లు  కలిసి వస్తాయని టీఆర్‌ఎస్‌లో ధీమా

సిద్దిపేట, నమస్తే తెలంగాణ 

 దుబ్బాక నియోజకవర్గంలో మహిళా ఓట్లు అధికంగా ఉ న్నాయి. ఉప ఎన్నికలో వారి ఓట్లే కీలకం. నియోజకవర్గంలో మొత్తం 1,98,807 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 98,028 మంది, మహిళా ఓట్లు 1,00,779 ఉన్నా యి. దుబ్బాక ఉపఎన్నిక రాజకీయాలు మరింతగా వేడెక్కా యి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు ప్రచార వ్యూహ, ప్రతి వ్యూహాలపై దృష్టిసారించాయి. ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థుల తోపాటు మొత్తం 23 మంది బరిలో నిలిచారు. ‘నోటా’తో కలుపుకొని 24 అవుతాయి. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకు కేటాయించడానికి వీలు ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నారు.  

కీలకం కానున్న అతివల ఓట్లు...                                                                                

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. నవంబర్‌ 3న పోలింగ్‌ జరుగనున్నది. ఉప ఎన్నికలో మహిళల ఓట్లు కీలకం కానున్నాయి. అన్ని పార్టీలు మహిళా ఓట్లపై దృష్టిసారించాయి. పు రుషుల ఓట్ల కన్నా మహిళా ఓట్లు 2,800 ఎక్కువగా ఉన్నా యి. దుబ్బాక  నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే, చేనేత, బీడీ కార్మికులు అధికంగానే ఉన్నారు. మండలాల వారీగా చూసుకుంటే మహిళా ఓట్లు దుబ్బాకలో పురుషుల ఓట్ల కన్నా 758 మంది ఎక్కువ ఉన్నాయి. మిరుదొడ్డి మండలంలో 590 మంది, తొగుట మండలంలో 215 మంది, దౌల్తాబాద్‌ మండలంలో 100 మంది, రాయపోల మండలంలో 55 మంది, చేగుంట మండలంలో 917 మంది, నార్సింగ్‌ మండలంలో 153 మంది, గజ్వేల్‌ మండలం (చిన్నఆరేపల్లి)లో 12 మంది మహిళల ఓట్లు పురుషుల కన్నా అధికంగా ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు మహిళా ఓట్లపై దృష్టిసారించాయి. 

టీఆర్‌ఎస్‌ వైపే మహిళల మొగ్గు...

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అం దజేస్తున్నది. దుబ్బాక నియోజకవర్గంలో అధికంగా బీడీ కార్మికులు ఉన్నారు. వీరిలో 20 వేల మందికి ప్రభుత్వం జీవనభృతిగా రూ. 2116  పింఛన్‌ ఇస్తున్నది. వీరితోపాటు వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. ఆయా వర్గాలకు లబ్ధి జరుగుతున్నందుకు వీరంతా అధికార టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో నిలిచారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటారనే పేరు ఉంది. ‘పుట్టెడు దుఃఖంతో మీముందుకు వచ్చాను’.. నన్ను ఆశీర్వదించండి అని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆమెకు కలిసి వచ్చే అవకాశం. మ హిళా అభ్యర్థి కావడం కూడా అనుకూలం. దీనికి తోడు మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో మహిళల ఓట్లు తమకు కలిసి వస్తాయని టీఆర్‌ఎస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని సోలిపేట సుజాత ప్రచారంలో దూసుకుపోతున్నది. ఆమె ప్రచారానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  

 దుబ్బాక నియోజకవర్గంలో మండలాల వారీగా ఓట్ల వివరాలు 

క.  మండలం పేరు                 పురుషులు            స్త్రీలు            థర్డ్‌ జెండర్‌         మొత్తం 

1.  దుబ్బాక     27,225        27,983              -                55,208

2   మిరుదొడ్డి     15,586          16,176              -              31,762

3.  తొగుట                         13,268          13,483            -            26,751

4  దౌల్తాబాద్‌                   11,466          11,566              -              23,032

5  రాయపోల్‌                   10,229          10,284            -                20,513

6  చేగుంట                         15,956        16,873            -                32,829

7. నార్సింగ్‌                         4,031            4,184            -                  8,215 

8  గజ్వేల్‌ (చిన్న ఆరెపల్లి)    217                229            -                    446

          మొత్తం ఓటర్లు             97,978             1,00,778        -              1,98,756

      *    సర్వీస్‌ ఓటర్లు             50                            01              -            51

     గ్రాండ్‌ టోటల్‌               98,028      1,00,779            -          1,98,807


VIDEOS

logo