గురువారం 26 నవంబర్ 2020
Siddipet - Oct 21, 2020 , 00:31:42

తనిఖీలకే ఉలిక్కిపాటు

తనిఖీలకే ఉలిక్కిపాటు

దుబ్బాక : ఎన్నికల విధుల్లో భాగంగా సోమవారం రాత్రి దుబ్బాకలో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న బీజేపీకి చెందిన ఓ వాహనాన్ని తనిఖీ చేసేందుకు నిలిపారు. ఇది తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. తమ వాహనాన్ని ఎలా ఆపుతారని ఎస్సై స్వామి, సీఐ హరికృష్ణగౌడ్‌తో వాగ్వాదానికి దిగారు. రెండు గంటల పాటు హైడ్రామా కొనసాగింది. పోలీసు నోడల్‌ అధికారి బాలాజీ సముదాయించినా వినలేదు. మొన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత వాహనాన్ని తనిఖీ చేయగా, పూర్తిగా సహకరించా రు. కాగా, తొగుట వెళ్తుండగా మంత్రి హరీశ్‌రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా, సాధారణ పౌరుడిగా సహకరించారు. కానీ, బీజేపీ నేతలు  త నిఖీల ఇష్యూను పెద్దగా చేసి లబ్ధి పొందేందుకు ప్ర యత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.