శనివారం 05 డిసెంబర్ 2020
Siddipet - Oct 21, 2020 , 00:31:39

ఎన్నికల తర్వాత కనబడరు

ఎన్నికల తర్వాత కనబడరు

చేసిన పనులు చెప్పలేక కాంగ్రెస్‌, బీజేపీ అసత్య ప్రచారాలు

గజ్వేల్‌ : ఎన్నికల సమయంలో మాయ మా టలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు కనిపించకుండా పోతారని ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్‌రావు విమర్శించారు. గజ్వేల్‌లో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీ దొందు దొందేనని, ఏనాడు ఆ పార్టీల ప్ర భుత్వాలు, నాయకులు ప్రజల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దుబ్బాక ఎన్నిక సందర్భంగా ఆ పార్టీల నాయకులు ప్రజలను మ రోసారి మభ్యపెట్టడానికి శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నారన్నారు. అభివృద్ధి, ప్రజాహి తం కోసం వారి ప్రభుత్వాలు చేసిన పనులేవీ చెప్పుకోవడానికి లేకపోవడంతో టీఆర్‌ఎస్‌పై అసత్య ఆరోపణలకు దిగుతున్నారన్నారు. ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఎలా ఓట్లడగాలో ఆర్థం కాక నోటికొచ్చిందల్లా వాగుతున్నారని మండిపడ్డారు. హుజూర్‌నగర్‌కు సీఎం కేసీఆర్‌ ఎందుకు రాలేదు? ఏమి అభివృద్ధి జరిగిందని? ఉత్తమ్‌కుమార్‌రెడి ప్రశ్ని స్తే, సైదిరెడ్డి దీటైన సమాధామిచ్చారన్నారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ రాలేదని, గెలిచి న తర్వాత వచ్చి రూ.300 కోట్ల అభివృద్ధి నియోజకవర్గ ప్రజలకు అందించారని ఆధారాలతో చూ పించారన్నారు. ఆపదలో ఆదుకోలేని పార్టీలు, అధికారంలోకి వస్తే ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతాయో ప్రజల్లో అవగాహన కల్పించాలని శ్రేణులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు.