బుధవారం 02 డిసెంబర్ 2020
Siddipet - Oct 21, 2020 , 00:31:36

దుబ్బాకలో సత్తా చాటుదాం

దుబ్బాకలో సత్తా చాటుదాం

అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌

తొగుట: దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని బండారుపల్లి, మెట్టు, పెద్దమాసాన్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ మాట్లాడుతూ మోటర్లకు మీటర్లు పెట్టడానికి చూస్తున్న బీజేపీ నాయకులను ఢిల్లీకి తరిమి కొట్టాలని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ మన ఆడపడుచు దుఃఖంలో మీ ముందుకు వచ్చిందని, అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సోలిపేట సుజాతకు లక్ష ఓట్ల మెజార్టీ అందించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఆమె కోరారు. అదేవిధంగా డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని, ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో సీఎం కేసీఆర్‌ దుబ్బాక ప్రజలకు అండగా ఉండాలని తనకు అవకాశం కల్పించారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత అన్నారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అండదండలతో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, రైతు బంధు రాష్ట్ర కమిటీ సభ్యులు దేవి రవీందర్‌, వైస్‌ ఎంపీపీ  శ్రీకాంత్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ హరికృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ, రైతుబంధు చైర్మన్లు గడీల అనితాలక్ష్మారెడ్డి, బోధనం కనకయ్య, పార్టీ మండలాధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, సర్పంచ్‌లు శారదా రఘోత్తంరెడ్డి, మెట్టు వరలక్ష్మి కనకయ్య, ఎంపీటీసీ సుమలత కనకయ్య, కోఆప్షన్‌ సభ్యులు ఎండీ కలీమొద్దీన్‌, ఉప సర్పంచ్‌ రాజిరెడ్డి, నాయకులు కంది రాంరెడ్డి, చిలువేరి రాంరెడ్డి, బక్క కనకయ్య, చెరుకు కొండల్‌రెడ్డి, కోల కనకయ్య, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.