ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 21, 2020 , 00:31:35

సీఎం కేసీఆర్‌ పాలనలోనే చేనేతలకు ఉపాధి

సీఎం కేసీఆర్‌ పాలనలోనే చేనేతలకు ఉపాధి

సుజాతక్కను లక్ష మెజార్టీతో గెలిపిస్తాం..

పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర మల్లేశం

రాయపోల్‌: సీఎం కేసీఆర్‌ పాలనలో చేనేతలకు చేతినిండా పని కల్పించి ఉపాధి చూపారని, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత లక్ష మెజార్టీతో గెలిపిస్తామని పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూర మల్లేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మండల పద్మశాలీల సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాడిన తర్వాతనే చేనేత, పద్మశాలీలను సమాజపరంగా ప్రభుత్వం ప్రోత్సాహం అందించి ఆదుకున్నదన్నారు. ప్రభుత్వ పథకాలు అందించడానికి ప్రత్యేక హ్యాండ్‌లూమ్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో రూ.కోటి చేనేత రుణమాఫీ జరిగిందన్నారు. ఉప ఎన్నికలో కారుగుర్తుకు ఓట్లు వేసి టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు, మండల అధ్యక్షుడు దుడుక రాములు, నాయకులు శ్రీనివాస్‌, స్వామి, నర్సింహులు, లక్ష్మీనారాయణ, గణేశ్‌, కుమార్‌, వెంకటేశం, భాస్కర్‌, శేఖర్‌, చేనేత కార్మికులు, పద్మశాలీలు పాల్గొన్నారు.
VIDEOS

logo