డిపాజిట్ల కోసమే బీజేపీ, కాంగ్రెస్‌ల పోటీ

సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి
దుబ్బాక టౌన్: దుబ్బాక ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని కోల్పోయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేవలం డిపాజిట్ల కోసమే ఆరాటపడుతున్నాయని సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి వార్డులో రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అధికం సుగుణ బాలకిషన్‌గౌడ్, కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ ఇన్చార్జి కొమ్ము బాబు టీఆర్ఎస్లో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. తప్పుడు ప్రచారంతో దుబ్బాక ప్రజలను మోసం చేయాలని చూస్తే ఊరుకోరని ఓట్లతో బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో 4, 5వ వార్డుల ఎన్నికల ఇన్చార్జిలు లక్కరసు ప్రభాకరవర్మ, శ్రీహరిగౌడ్, నాయకులు జానీ, కనకయ్య, యాదగిరి తదితరులు ఉన్నారు.
ప్రతిపక్షాలకు గుణపాఠం కావాలి..
దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లు ఇచ్చే తీర్పుతో ప్రతిపక్షాలకు గుణపాఠం కావాలని సిద్దిపేట ఏఎంసీ చైర్మన్, 18వ వార్డు టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి పాల సాయిరాం అన్నారు. మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి సాయిరాం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో నాయకులు గన్నె భూంరెడ్డి, ఆకుల దేవేందర్‌రెడ్డి, కాల్వ శ్రీనివాస్, గోనె మధు తదితరులున్నారు.
తాజావార్తలు
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
- ఓటీపీ చెప్పండి.. కార్డు గడువు పొడిగిస్తాం..!
- రెండు రోజుల్లో.. రూ. 5లక్షలకు 4.5 కోట్లు లాభం
- రుణాల పేరుతో.. బురిడీ..
- పెండ్లి పేరుతో వల.. రూ. 10.69లక్షలు టోకరా
- బండి ఆపు.. పైసలివ్వు..!