పచ్చదనం ఉట్టిపడేలా రైతు వేదికలు

వేదికల ఆవరణలో మొక్కలు పెంచాలి
పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
గజ్వేల్/మర్కూక్: రైతు వేదికల ఆవరణలో పచ్చదనం ఉట్టిపడేటట్లు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. వర్గల్ మం డలం గౌరారం, మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి, మర్కూక్‌లో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను గడా ఓఎస్డీ ముత్యంరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మరింత సౌకర్యవంతంగా, అం దంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. రైతు వేదికల ఆవరణలో నీడనిచ్చే మొక్కలతోపాటు పూలు, రకాల మొక్కలను నాటాలన్నారు. రైతు సమావేశాలకు వీలుగా అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేవిధంగా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. రైతు వేదికలు, పల్లె వనాలతో గ్రామాలకు మరింత కొత్తశోభ సంతరించుకుంటుందని, అందుకుగాను గ్రామా లు పోటీపడి సౌకర్యవంతంగా, అందంగా ఏర్పాటుకు కృషిచేయాలని స్థానికులకు సూచించారు. ప్రభుత్వం గ్రామాల్లో కూడా పలు వసతులు కల్పిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్మాణ సంస్థలకు, పర్యవేక్షణ అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట గడా ముత్యంరెడ్డి, తహసీల్దార్ ఆరిఫా, ఏవో నగేందర్రెడ్డి ఉన్నారు.
పనులను తనిఖీ చేసిన సంగారెడ్డి కలెక్టర్
హత్నూర: రైతువేదిక నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం మం డలహత్నూరలో నిర్మిస్తున్న రైతువేదిక పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ నిర్మాణ పనులు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ జయరాం, ఎంపీడీవో శారదాదేవి, రెవెన్యూ సిబ్బంది సిద్ధిరాంరెడ్డి ఉన్నారు.
తాజావార్తలు
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జునర్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!