మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Oct 19, 2020 , 01:02:42

బీజేపీ నాయకులు సోషల్‌ మీడియాకే పరిమితం

బీజేపీ నాయకులు సోషల్‌ మీడియాకే పరిమితం

గజ్వేల్‌అర్బన్‌ : టీఆర్‌ఎస్‌పై బీజేపీ నాయకులు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వారంతా సోషల్‌ మీడియాకే పరిమితమని ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం సాధించాలన్న ఆలోచనతో టీఆర్‌ఎస్‌పై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు  కేవలం రెండోస్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారన్నారు. దుబ్బాకలో భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయమన్నారు. సమావేశంలో కౌన్సిలర్‌ ఉప్పల మెట్టయ్య తదితరులు ఉన్నారు.


VIDEOS

logo