గురువారం 04 మార్చి 2021
Siddipet - Oct 18, 2020 , 01:03:58

అల్లర్లు సృష్టిస్తే సహించం

అల్లర్లు సృష్టిస్తే సహించం

మిరుదొడ్డి: దుబ్బాక ఉప ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదని సిద్దిపేట సీపీ జోయల్‌ డెవిస్‌ అన్నారు. శనివారం మిరుదొడ్డి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. గత ఎన్నికల్లో నమోదైన కేసుల వివరాలను ఎస్సై శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆయా గ్రామాలకు కేటాయించిన వీపీవోలు నిత్యం వారి గ్రామాలను సందర్శించాలని సూచించారు. గ్రామాల్లో గొడవలు జరుగకుండా చూడాలన్నారు. గత ఎన్నికల్లో కేసులు నమోదైన వారిని వెంటనే బైండోవర్‌ చేయాలని ఎస్సైని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమోరాల పని తీరును పరిశీలించి పనిచేయని వాటిని సరి చేయాలని ఎస్సైకి సూచించారు.

VIDEOS

logo