బుధవారం 03 మార్చి 2021
Siddipet - Oct 17, 2020 , 05:09:43

దుబ్బాక ఉప ఎన్నికకు 103 నామినేషన్లు

దుబ్బాక ఉప ఎన్నికకు 103 నామినేషన్లు

46 మంది అభ్యర్థులు దాఖలు

ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

17న నామినేషన్ల పరిశీలన,  19న ఉపసంహరణ.. 

దుబ్బాక టౌన్‌ : సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 46మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 9న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కాగా, శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇందులో రెండో శనివారం, ఆదివారం సెలువు దినాలు కావడంతో మిగిలిన ఆరు రోజుల్లో నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం 34 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 46 మంది అభ్యర్థుల్లో సోలిపేట సుజాత (టీఆర్‌ఎస్‌), మాధవనేని రఘునందన్‌రావు (బీజేపీ), చెరుకు శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్‌), కార్తీక బీఆర్‌ఎం (ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌), గౌటి మల్లేశ్‌ (జై స్వరాజ్‌ ),లొగ్గరి రమేశ్‌ (బహుజన రాష్ట్ర సమితి), సూకూరి అశోక్‌ (రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియన్‌), మైసంగారి సునీల్‌ (ఇండియన్‌ ప్రజాబంధు), సుదర్శన్‌ అడెపు (శివసేన), జాజుల భాస్కర్‌ (శ్రమజీవి), ఎం.జగదీశ్‌రాజ్‌ (ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌), వడ్ల శ్యామ్‌ (అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌), చెరుకు విజయలక్ష్మి (ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌), జె.భరత్‌సింహా రాయుడు (తెలంగాణ జగ్‌హీర్‌), బుర్ర రవితేజ, రేవు చిన్నధనరాజ్‌, శ్రీకాంత్‌ సిలివేరు, మోతె నరేశ్‌, మీసాల రాజసాగర్‌, కోట శ్యామ్‌కుమార్‌, షేక్‌ సర్వర్‌హుస్సేన్‌, పెద్దలింగన్నగారి ప్రసాద్‌, పోసానిపల్లి మహిపాల్‌రెడ్డి, దొడ్ల వెంకటేశం, కొల్కురి ప్రసాద్‌, అడ్ల కుమార్‌, గొంది భుజంగం, కొట్టాల యాదగిరి, జక్కుల నర్సింహులు, మద్దెల నర్సింహులు, పెద్దమాతరి బాబు, వడ్ల మాధవాచారి, వర్కొల్‌ శ్రీనివాస్‌, ఉడత మల్లేశం, కంటె సాయన్న, రణవేని లక్ష్మణ్‌, బుట్టెంగారి మాధవరెడ్డి, వేముల విక్రమ్‌రెడ్డి, రేపల్లి శ్రీనివాస్‌, మల్లిఖార్జన్‌ పెట్టం, పిడిశెట్టి రాజు, బండారు నాగరాజు, కొల్లూరు జగన్మోహన్‌రావు ముదిరాజ్‌, జక్కుల రాధారమణి, అల్వాల్‌ కృష్ణస్వామి, డి.కిషన్‌రావులు ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. 

జిల్లాకు సాధారణ ఎన్నికల పరిశీలకుడి రాక 

సిద్దిపేట కలెక్టరేట్‌ : జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా రాఘవశర్మను నియమించినట్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు రాఘవశర్మ గురువారం సిద్దిపేట జిల్లాకు వచ్చారన్నారు. ఎన్నికలు ముగిసే వరకు సిద్దిపేటలోని విద్యుత్‌ గెస్ట్‌హౌస్‌లో అందుబాటులో ఉంటారన్నారు. ముందస్తు అనుమతితో రాజకీయ పార్టీల ప్రతినిధులు, దుబ్బాక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సాధారణ వ్యయ పరిశీలకుడు రాఘవశర్మను సంప్రదించవచ్చన్నారు. నేరుగా కలువలేని వారు 9816818005 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.  దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ఫిర్యాదులుంటే పరిశీలకుడికి తెలియజేయాలన్నారు.

VIDEOS

logo