ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Oct 17, 2020 , 02:44:43

వార్డుల్లో జోరందుకున్న ప్రచారం

వార్డుల్లో జోరందుకున్న ప్రచారం


 వార్డుల్లో జోరందుకున్న ప్రచారం 

దుబ్బాక టౌన్‌ :   దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతక్కను లక్ష మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. శుక్రవారం మున్సిపల్‌ పరిధిలోని చెల్లాపూర్‌ 2, 3 వార్డుల్లో కౌన్సిలర్లు గోనెపల్లి దేవలక్ష్మి్డ, మట్ట మల్లారెడ్డి అధ్వర్యంలో ఆ వార్డుల ఇన్‌చార్జిలు సిద్దిపేట రూరల్‌ ఎంపీపీ చందర్‌రావు, పెద్దలింగారెడ్డి పల్లి సర్పంచ్‌ మెహన్‌రెడ్డి సమక్షంలో పద్మశాలీ సంఘం, విశ్వబ్రహ్మ సంఘం టీఆర్‌ఎస్‌లో చేరి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సిద్దిపేట మం డల కో-ఆర్డినేటర్‌ మోహన్‌రెడ్డి, దుబ్బాక రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ వంగ బాల్‌రెడ్డి, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు అడెపు లక్ష్మీపతి, నాగభూషణం, అంజయ్య, విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షుడు రామోజీ ఆనంద్‌, బాలాచారి, వడ్ల బాలయ్య తదితరులు పాల్గొన్నారు. 

రాయపోల్‌లో..

రాయపోల్‌ : మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామం లో శుక్రవారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వెంకట నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. కిష్టాసాగర్‌, కొత్తపల్లి గ్రామాల్లో జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులు కల్యాణాకర్‌ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం  చేశారు. కార్యక్రమంలో శివకూమార్‌,లక్ష్మి నర్సింహారెడ్డి, వెంకట్‌గౌడ్‌, శంకర్‌, ప్రతాప్‌రెడ్డి, సత్యం, స్వామి తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo