మంగళవారం 09 మార్చి 2021
Siddipet - Oct 16, 2020 , 02:14:05

ప్రతి పక్షాల డిపాజిట్లు గల్లంతు..

ప్రతి పక్షాల డిపాజిట్లు గల్లంతు..

  • l ప్రభుత్వ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి
  • l జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు

రాయపోల్‌ : ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు ఖాయమని జహీరాబాద్‌ ఎమ్మెల్యే, మండల ఎన్నికల ఇన్‌చార్జి మాణిక్‌రావు అన్నారు. గురువారం మండలంలోని ఎల్కల్‌ గ్రామంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మామిడి మోహన్‌రెడ్డి, ఉమ్మడి టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, ఎంపీటీసీ పిట్ల వెంకటయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ములుగు జడ్పీటీసీ జయమ్మ అర్జున్‌గౌడ్‌, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళిగుప్తా, సీనియర్‌ నాయకులు డాక్టర్‌ యాదవరెడ్డి, సర్పంచ్‌ శ్యామలాకుమార్‌, ఆత్మ డైరెక్టర్‌ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ గులాబీ దండు..

మండలంలోని వివిధ గ్రామాల్లో  సోలిపేపేట సుజాతకు మద్దతుగా గురువారం ఇంటింటికీ గులాబీదండు వెళ్లి ప్రచారం చేసింది. ఇందులో భాగంగానే వడ్డేపల్లిలో గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ మాదాసు అన్నపూర్ణతో పాటు కౌన్సిలర్లు  ఇంటింటికీ వెళ్లి కారుగుర్తుకు ఓటు వేయాలని  కోరారు. బేగంపేటలో టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వుడెం కష్ణారెడ్డి, కొత్తపల్లి, కిష్టాసాగర్‌ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు కళ్యాణాకర్‌ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు తీగుళ్ల స్వామి, మండల మహిళా నాయకురాలు బాల్‌లక్ష్మి, నాయకులు శ్రీధర్‌, స్వామి, ఆంజనేయులు, లచ్చయ్య, ఆకుల దేవేందర్‌, రాజమౌళిగుప్తా పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo