ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Oct 16, 2020 , 02:14:05

ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలె..

ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలె..

  • వానకాలం ఊసిల్ల మాదిరిగా ఓట్లప్పుడే వస్తరు..
  • కల్లబొల్లి మాటలు నమ్మొద్దు
  • యువతే టీఆర్‌ఎస్‌ సైన్యం 
  • సుజాతక్కను లక్ష మెజార్టీతో గెలిపించాలి
  • మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
  • ఎంపీ సమక్షంలో హబ్షీపూర్‌ బీజేపీ నాయకులు  టీఆర్‌ఎస్‌లో చేరిక

దుబ్బాక : ‘కాంగ్రెస్‌, బీజేపీలను భూస్థాపితం చేయాలి.. వాళ్లు చెప్పే మాయమాటలు నమ్మొద్దు.. టీఆర్‌ఎస్‌కు  సైనికుల్లా యువత ముందుండాలి’ అని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక రెడ్డి సంఘంలో ఎంపీ సమక్షంలో మండలంలోని హబ్షీపూర్‌కు  చెందిన బీజేపీ నాయకులు, పలు యువజన సంఘాల నాయకులు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వాన కాలంలో ఊసిర్ల మాదిరిగా ఓట్ల కోసమే వచ్చే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు  తగిన గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సూజాతక్కను లక్ష మెజార్టీతో గెలిపించి దుబ్బాక సత్తా చాటాలన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు ద్వితీయ స్థానం కోసమే పోటీ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ సర్కారుకే ప్రజలు జై కొడుతున్నారని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు దేవేందర్‌రెడ్డి, మనోహర్‌రావు, వెంకటనర్సింహారెడ్డి, రొట్టె రాజమౌళి, దుబ్బాక  పీఏసీఎస్‌ చైర్మన్‌ కైలాశ్‌, వైస్‌ ఎంపీపీ అస్క రవి, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.  

ప్రజా తీర్పుతో కాంగ్రెస్‌, బీజేపీల దిమ్మతిరగాలే.. 

మిరుదొడ్డి : దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే ఓట్ల తీర్పుతో కాంగ్రెస్‌, బీజేపీలకు దిమ్మతిరగాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అల్వాల్‌లో గంగపుత్ర సంఘం సభ్యులు, భూంపల్లిలో ముదిరాజ్‌ సంఘం సభ్యులతో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు బొంపల్లి మనోహర్‌రావులతో కలిసి ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మత్స్య కారులను ఆర్థికాభివృద్ధికి ప్రతి ఏటా రూ.4 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతారామలింగారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

లక్ష మెజార్టీ ఖాయం...

ఉప పోరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు లక్ష ఓట్ల మెజార్టీ రావడం ఖాయమని ఉప ఎన్నికల వీరారెడ్డిపల్లి గ్రామ ఇన్‌చార్జి, సంగారెడ్డి జడ్పీ వైస్‌ చైర్మన్‌ వై.ప్రభాకర్‌ అన్నారు. గురువారం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చెప్పే కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పన్యాల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చాట్ల్లపల్లి బాలమల్లేశం గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ బాలకృష్ణ, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మహంకాళి, బాలకృష్ణ, నవీన్‌ పాల్గొన్నారు. 

మూడొద్దుల సుల్తానులను నమ్మొద్దు...

- పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

ఎన్నికల సమయంలో వచ్చే మూడొద్దుల సుల్తానులను ప్రజలు నమ్మొద్దని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. దుబ్బాక ప్రజలకు ఏది కావాలన్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు ఉన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మీ ఆడబిడ్డ సోలిపేట సుజాతను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ గజ్జెల సాయిలు, పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య, పార్టీ సీనియర్‌ నాయకులు సూకురి లింగం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లింగాల వెంకట్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ పోలీస్‌ రాజులు, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, జిల్లా గ్రంథాలయ బోర్డు డైరెక్టర్‌ బోయ శ్రీనివాస్‌, ఎర్మని దుబ్బరాజం పాల్గొన్నారు. 

VIDEOS

logo