శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Oct 14, 2020 , 01:47:56

ప్రతి గింజా కొనుగోలు చేయాలి

ప్రతి గింజా కొనుగోలు చేయాలి

  • n ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా  చర్యలు తప్పవు
  • n జిల్లాలో 309 ధాన్యం  కొనుగోలు కేంద్రాలు
  • n 72 గంటల్లో రైతుల ఖాతాల్లో  డబ్బులు జమయ్యేలా చూడాలి
  • n జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

మెదక్‌ కలెక్టరేట్‌: రైతులు పండించిన ప్రతి చివరి గింజా కొనుగోలు చేయాలని మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లు, తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మెదక్‌ జిల్లా వ్యా ప్తంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్ల క్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామన్నారు.  జిల్లా వ్యాప్తంగా 309 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తు తం వర్షాలు కురుస్తున్నందున రైతులు తమ పొలాల్లో నూర్పిడి పనులు ప్రారంభించలేదని, ప్రారంభించిన వెంటనే వాటిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తారన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన  ఏర్పాట్లు చేయాలన్నారు. సమయానికి పంట కొనుగోలు చేయడంతోపాటు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ విషయంలో రైస్‌మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయా మండలాల్లో తహసీల్దార్లు కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు సందర్శించడంతోపాటు ఎంత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుంది.. ఏ రోజు ఎంత కొనుగోళ్లు జరుగుతుంది.. ఎంత నిల్వ ఉంది.. నిల్వ ఉంచడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయా అనే వివరాలను తెలుసుకోవాలన్నారు.  ఆర్డీవోలు సైతం ప్రతిరోజూ ధాన్యం కొనుగోలుపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. ధాన్యం కేంద్రాల వద్ద లోడింగ్‌, అన్‌లోడింగ్‌, ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆర్టీఏ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఈవో రమేశ్‌కుమార్‌, రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు చంద్రపాల్‌, డీఎస్‌వో శ్రీనివాస్‌, మార్కెటింగ్‌ శాఖ ఏడీ రమ్య, డీఎస్పీ కృష్ణమూర్తి, ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

 16 వరకు ఈ-పంచాయతీ ..  వివరాలను పూర్తి చేయాలి

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పంచాయతీ వివరాలను మూడు రోజుల్లో పూర్తి చేయాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలు, ధరణి పోర్టల్‌లో ఈ నెల 16వ తేదీలోగా నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వివరాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం, నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన మేరకు ఈ- పంచాయతీ, పల్లె ప్రకృతి వనాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసిన అధికారులకు తగిన గుర్తింపు ఇస్తామ న్నారు. మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ కమిషనర్లతో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది ఉద యం 5.30 గంటలకు ఫీల్డ్‌కు వెళ్లాలని, వారు ఎక్కడ పనులు చేస్తున్న వివరాలను ఫొటోలు తీసి వాట్సాప్‌లో పంపించాలన్నారు.  మెదక్‌ జిల్లాను అన్నిరంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులు సహకరించాలని కలెక్టర్‌ కోరారు.  

VIDEOS

logo