ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతే...

- దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయం..
- సోషల్‌మీడియాలో తప్ప ప్రజల్లో లేని ప్రతిపక్షాలు..
- అభివృద్ధి చేసే వారినే ప్రజలు నమ్ముతారు
- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
- చేగుంట వైస్ ఎంపీపీతో పాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన 200మంది టీఆర్ఎస్లో చేరిక
చేగుంట : రానున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని, నేడు నిజామాబాద్, నిన్న హుజూర్నగర్, త్వరలో జరుగబోయే జీఎచ్ఎంసీలో కూడా టీఆర్ఎస్కు మంచి ఫలితాలను సాధించి ప్రతిపక్షాలకు ప్రజలు డిపాజిట్ గల్లంతు చేస్తారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. మండల కేంద్రమైన చేగుంటలోని సాయిబాలాజీ గార్డెన్లో సోమవారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో చేగుంట వైస్ ఎంపీపీ మున్నూర్ రామచంద్రంతో పాటు చందాయిపేట ఎంపీటీసీ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన రెండు వందల మంది టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజలకు సీఎం కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు. నిజామాబాద్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 728 ఓట్లు రాగా, 56 బీజేపీ, 29 కాంగ్రెస్‌కు వచ్చాయని, కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా చేసి ప్రజలు మంచి తీర్పునిచ్చారని మంత్రి తెలిపారు. దుబ్బాక ప్రాంతం మీద కాంగ్రెస్ నాయకులకు కనీసం అవగాహన లేదన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎవరి గ్రామంలో వారే 20రోజుల పాటు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా రాకుండా చేయాలని మంత్రి కోరారు.
దుబ్బాకలో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత భారీ మెజార్టీతో గెలవనున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందకు గ్రామాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున్న బతుకమ్మలు, బోనాలతో స్వాగతిస్తున్నారన్నారు. సమావేశంలో చేగుంట ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మండల సర్పచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి, డీసీఎంఎస్ జిల్లా డైరెక్టర్ స్వామి, సొసైటీ చైర్మన్లు పరమేశ్, వంటరి కొండల్‌రెడ్డి, డైరెక్టర్లు సిద్ధిరాములు, రఘురాములు, వివిధ గ్రామా ల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వీడియో : పెద్దగట్టు జాతర
- రానా తమ్ముడు హీరోగా వచ్చేస్తున్నాడు!
- రూ.45వేల దిగువకు బంగారం ధర.. అదేబాటలో వెండి
- రియల్టర్ దారుణం : పెండ్లి పేరుతో కూతురు వయసున్న మహిళపై లైంగిక దాడి!
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ