శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 12, 2020 , 01:12:06

స్ట్రాంగ్‌ రూమ్‌కు ఎన్నికల సామగ్రి

 స్ట్రాంగ్‌ రూమ్‌కు ఎన్నికల సామగ్రి

   దుబ్బాక టౌన్‌ : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా లచ్చపేట మోడల్‌ స్కూల్‌లో ఎన్నికల సామగ్రిని అధికారులు భద్రపరిచారు. శనివారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య, ఎన్నికల పోలీస్‌ నోడల్‌ అధికారి బాలాజీ, సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్‌ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు సమక్షంలో ఎన్నికల సామగ్రి వీవీ ప్యాట్లతో పాటు ఇతర సామగ్రి ఉంచిన స్ట్రాంగ్‌ రూంకు సీల్‌ చేశారు.

ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికకు చెందిన ఎన్నికల సామగ్రిని లచ్చపేట మోడల్‌ స్కూల్‌లో భద్రపరిచామన్నారు. అందుకు అవసరమైన పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పోలీస్‌, రెవెన్యూ అధికారులు  24 గంటల పాటు పర్యవేక్షిస్తారన్నారు. అధికారుల పర్యవేక్షణతో పాటు స్కూలు పరిసరాల్లో సీసీ కెమెరాల నిఘాతో పాటు లైటింగ్‌ను ఏర్పాటు చేశారు.  రిటర్నింగ్‌ అధికారి వెంట దుబ్బాక సీఐ హరికృష్ణ, ఎస్‌ఐ స్వామి, పోలీస్‌, రెవెన్యూ అధికారులు, పలు రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. 

VIDEOS

logo