ప్రేమ జంట ఆత్మహత్య

సిద్దిపేట రూరల్ : పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి ప్రేమికుడు, ఆదివారం మధ్యాహ్నం ప్రేమికురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండాల ఆనంద్ అలియాస్ రాము(23), అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరువురి తల్లిదండ్రులు తిరస్కరించి, పలుమార్లు హెచ్చరించినా వారు వినలేదు. కాగా, ఈ నెల 8వ తేదీన ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయి ఆనంద్ అలియాస్ రాము వ్యవసాయ పొలం వద్ద తలదాచుకున్నారు.
తొమ్మిదో తేదీన వారి తల్లిదండ్రులు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ ప్రేమ విఫలమైందని ఇద్దరూ పదో తేదీ ఉదయం పురుగుల మందు తాగారు. రాము తన తండ్రికి ఫోన్ చేసి పురుగుల మందు తాగామని తమను బతికించమని చెప్పాడు. దీంతో గ్రామస్తుల సహకారంతో అంబులెన్స్‌కు ఫోన్ చేసి సిద్దిపేట ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి రాము మృతి చెందగా, ఆదివారం మధ్యాహ్నం బాలిక మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దిపేట రూరల్ ఎస్సై శంకర్ తెలిపారు.
తాజావార్తలు
- వీడియో : ఒకే రోజు 3,229 పెండ్లిండ్లు
- పూరీ తనయుడు మరింత రొమాంటిక్‌గా ఉన్నాడే..!
- ఎమ్మెల్సీ ప్రచారంలో దూసుకుపోతున్న సురభి వాణీదేవి
- కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత