కాంగ్రెస్, బీజేపీ ఏం చేశాయ్!

- మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
- టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు ఘనస్వాగతం
- రామలింగారెడ్డి మరణంతో పుట్టెడు దుఖంతో మీ ముందుకు వస్తున్న..
- నన్ను అశీర్వదించి అక్కున చేర్చుకోండి
- ఎన్నికల ప్రచారంలో కంటతడి పెట్టిన టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత
- విరాళంగా డబ్బులు ఇచ్చిన చిన్నారులు
దౌల్తాబాద్: ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఏం చేశాయని ఓట్లు అడుగడానికి వస్తున్నారో చెప్పాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రశ్నించారు. వారి హయాంలో రైతులు, కార్మికులు, కర్షకులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మండలంలోని మాచిన్పల్లి, మాచిన్పల్లి మదిర గ్రామం శేరిల్లా, అప్పాయిపల్లి, ఇందుప్రియల్ గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు మాచిన్పల్లి గ్రామంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటి నీళ్లు పోశారు.
ఈ సందర్భంగా పద్మదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకకు ఉప ఎన్నికలు రావడం చాలా బాధాకారమాన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సోలిపేట రామలింగన్నతో కలిసి ముందుండి ఉద్యమాలు చేసి జైలుకు పోయామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రత్యేక తెలంగాణ కోసం వెనకడుగు వేయకుండా ఉద్యమం చేశారన్నారు. మూడు నెలల కిందట రామలింగన్నతో కలిసి 53 కిలో మీటర్లు కొండపొచమ్మ కాల్వ వెంబడి ప్రయాణం చేసి కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఎకరాకు నీళ్లు అందించి రైతుల కాళ్లు కడిగి వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే లింగన్న కోరిక అన్నారు. లింగన్న కలలను నిజం చేయాలన్న సీఎం కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాతకు టీఆర్ఎస్ టికెట్‌ను ఇచ్చారు. పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలన్నా సుజాతను ఆశీర్వదించి భారీ మెజార్టీతో సోలిపేట సుజాత గారిని గెలిపించాలన్నారు.
గత పాలకుల హయాంలో అరిగోస పడ్డ ప్రజలు
కాంగ్రెస్ ప్రభుత్వంలో బిందె నీళ్ల కోసం మహిళలు ఇబ్బంది పడ్డారు. నీళ్ల కోసం బిందెలు పట్టుకొని బోర్ల కాడికి వెళ్లి తెచ్చుకునేవారు. ఎవరైనా చనిపోతే స్నానం చేయడానికి 10 నిమిషాలు కరెంట్ ఇవ్వడానికి ఏఈకి ఫోన్ చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్‌తో రైతుల కష్టాలు దూరమయ్యాయన్నారు. మిషన్ భగీరథ పథకంతో నీళ్ల పరిస్థితి పోయిందని గుర్తు చేశారు.
ఆడవాళ్లును గౌరవించడం నేర్చుకో ఉత్తమ్..
‘రామలింగారెడ్డి మరణంలో పుట్టెడు దు:ఖంలో ఉన్న సోలిపేట సుజాతను అవమాన పరుస్తావా..? గాలి మాటలు మానుకో.. ఖబర్దార్ ఉత్తమ్.. ఆడవాళ్లను గౌరవించడం నేర్చుకో.. లేకపోతే దుబ్బాక గడ్డపై తిరుగనివ్వరు. నీకు తగిన బుద్ధి దుబ్బాక ప్రజలు చెప్పడం ఖాయం’అని అన్నారు.
ఆశీర్వదించండి..ఆదరించండి..
‘ఎమ్మెల్యే సోలిపేట మరణంతో పుట్టెడు దు:ఖంతో మీ ముందుకు వస్తున్న.. నన్ను ఆశీర్వదించండి... రామలింగారెడ్డి బాటలో నడుస్తా’..అని టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత అన్నారు. ‘ఎవరు ఏ పని కోసం వచ్చినా మా సొంత ఊరు చిట్టాపూర్లోనే ఉంటా.. అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తా.. రామలింగారెడ్డి కలలను నిజం చేస్తా’.. అంటూ సూజాత కంటతడి పెట్టగా, ఆమెతోపాటు మాచిన్పల్లి, అప్పాయిపల్లి వాసులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.
చిన్నారుల విరాళం..
మాచిన్‌పల్లికి చెందిన చిన్నారి నాని రూ.వెయ్యి, ఇందుప్రియల్ గ్రామానికి చెందిన చిన్నారి వీరమ్మ దాచుకున్న రూ.వెయ్యిని టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు ఎన్నికల నామినేషన్ ఖర్చుల కోసం అందజేశారు.
శేరిల్లాలో ఏకగ్రీవ తీర్మానం..
మాచిన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మదిర గ్రామమైన శేరిల్లా గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలు టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మానం చేసి, దాని ప్రతిని టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగాధరి సంధ్య, జడ్పీటీసీ రణంజ్యోతి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు రహీమొద్దీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్‌లు యాదమ్మ, కుక్కల సుగుణ, సూరంపల్లి శ్యామల, వైస్‌ఎంపీపీ శేఖర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకన్న, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పాక్ క్రికెటర్ అక్మల్‌కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్‌కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్‌షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు