ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 10, 2020 , 01:45:58

సిద్దిపేట జిల్లాలో విలీనంతో.. దశ తిరిగిన ‘హుస్నాబాద్‌'

 సిద్దిపేట జిల్లాలో విలీనంతో..  దశ తిరిగిన ‘హుస్నాబాద్‌'

  • హుస్నాబాద్‌ చరిత్రను మార్చిన ‘అక్టోబర్‌ 10’
  • నాలుగేండ్లలో పరుగులు పెడుతున్న అభివృద్ధి
  • సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి
  • ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ కృషితో ప్రగతి పథంలో

హుస్నాబాద్‌ : పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన హుస్నాబాద్‌ ప్రాంతానికి కలిసొచ్చిందని చెప్పొచ్చు. కరీంనగర్‌ జిల్లాలో మారుమూల ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్‌, కోహెడ మండలాలను కొత్త గా ఏర్పాటైన సిద్దిపేట జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ రెండు మండలాల దశ తిరిగింది. కొత్త జిల్లాలో చేరడంతోపాటు హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేయ డం, ఇతర డివిజన్‌ స్థాయి కార్యాలయాలు రావడంతో పట్టణానికి ఎన్నడూ లేనంత ప్రాధాన్యత పెరిగింది. రెవెన్యూ డివిజన్‌ పరిధిలో హుస్నాబాద్‌ మండలంతోపాటు కొత్తగా ఏర్పడిన అక్కన్నపేటతోపాటు, కోహెడ, మద్దూరు, బెజ్జంకి మండలాలను చేర్చారు. భౌగోళికంగా అనుకూల పరిస్థితులు ఉండడంతో ఐదు మండలాలతో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశా రు. డివిజన్‌ ఏర్పాటుతో ఆర్డీవో, ఏసీపీ, ఆర్టీఏ, డివిజనల్‌ అటవీశాఖ తదితర కార్యాలయాలు వచ్చాయి. గడిచిన నాలుగేండ్లలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేశారు.

హుస్నాబాద్‌ చరిత్రను మార్చిన ‘అక్టోబర్‌ 10’... 

రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌ 10న కొత్త జిల్లాలు ఏ ర్పాటు చేయడం, కొత్తగా ఏర్పాటైన సిద్దిపేటలో హుస్నాబాద్‌ ప్రాంతం విలీనం కావడంతో అప్పటివరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న హుస్నాబాద్‌ ప్రాంత చరిత్ర పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సీఎం కేసీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సొంత జిల్లాలో హుస్నాబాద్‌ను వీలినం చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రథమ పౌరుడు, రాష్ట్ర మంత్రి సిద్దిపేట జిల్లావాసులు కావడంతో హుస్నాబాద్‌ ప్రాంత అభివృద్ధికి నిధుల వరద పారింది. ప్రజల సమస్యలు కూడా యుద్ధప్రాతిపదికన పరిష్కారం కావడం, గ్రామాలకు ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి నిధులు మంజూరు అవుతుండడం, మెట్ట ప్రాంత వరప్రదాయినీ గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులు తుది దశకు చేరుకోవడం తో హుస్నాబాద్‌ డివిజన్‌ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. సీఎం, మంత్రి, ఎమ్మెల్యేల చొరవతో త్వరలోనే గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లు పూర్తయి, ఈ ప్రాంతంలోని సుమారు 1.55 లక్షల ఎకరాలకు సాగు నీరందనుంది. స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌.. హుస్నాబాద్‌, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో నిరంతరం పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. అలాగే, రెనెన్యూ డివిజన్‌ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు.

నాలుగేండ్లలో ఎంతో అభివృద్ధి ...

హుస్నాబాద్‌ డివిజన్‌లోని మద్దూరు, బెజ్జంకి మండలా లు మినహా హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాల కు నాలుగేండ్ల కాలంలో ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి నిధులు మంజూరయ్యాయంటే ఈ ప్రాంతం ఎంత అభివృద్ధికి నోచుకుందో విదితమవుతుంది. ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ నిరంతర కృషితో హుస్నాబాద్‌ ప్రాం తం అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నది. హుస్నాబాద్‌ పట్టణాభివృద్ధికి నాలుగేండ్లలో సుమారు రూ.30కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీంతో పట్టణంలోని దాదాపు అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తయింది. పాలిటెక్నిక్‌ కళాశాల భవనం, నూతన దవాఖాన భవనం, మినీ స్టేడియం భవనం, టీచర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. మూడు మండలాల్లోని పలు గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలు, మహిళా సంఘం భవనాల నిర్మాణం చేపట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు చొరవతోనే.. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రు లు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రత్యేక చొ రవతోనే హుస్నాబాద్‌ ప్రాంతానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయడంతో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నాం. రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన హుస్నాబాద్‌తో పాటు అక్కన్నపేట, కోహెడ మండలాల్లో గడిచిన నాలుగేండ్లుగా ఎంతో అభివృద్ధి జరిగింది. సీఎం సొంత జిల్లాలోకి మారడంతో హుస్నాబాద్‌ ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉంది. రాబోయే రోజుల్లోనూ సీఎం, మంత్రుల సహకారంతో ఈ ప్రాంతం అన్ని రంగా ల్లో మరింత అభివృద్ధిని సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నా. 

- వొడితెల సతీశ్‌కుమార్‌ (హుస్నాబాద్‌ ఎమ్మెల్యే )

VIDEOS

logo