టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి

- నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
చేగుంట : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. చేగుంట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి, నడిమితండా, పులిగుట్ట తండాలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్నివర్గాల వారు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ప్రచారంలో ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్‌కుమార్, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, గొర్రె వెంకట్‌రెడ్డి, సర్పంచులు మోహన్, స్వాతి శ్రీనివాస్, ఎంపీటీసీ హోళియానాయక్, స్థానిక నాయకులు అంజగౌడ్, యాదిరెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన యువకులు..
ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి ఆధ్వర్యంలో మక్కరాజిపేట గ్రామానికి చెందిన 50మంది యువకులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ కమ్మరి శ్రీనివాస్, ఎంపీటీసీ బండి కవిత విశ్వేశ్వర్, మండల రైతు సంఘం అధ్యక్షుడు జింక శ్రీనివాస్, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మీశంకర్గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్తిరెడ్డి, రాజిరెడ్డి, యాదివరెడ్డి, సురేశ్‌రెడ్డి, బాల్శివ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం
- టీఆర్ఎస్, బీజేపీ పాలనలోని వ్యత్యాసాలను వివరించండి
- రానా 'అరణ్య' ట్రైలర్ వచ్చేసింది
- అవినీతి ఆరోపణలు.. గుడిపల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్
- ఎన్నికల తాయిలంగా కోడిపిల్లలు.. పట్టుకున్న అధికారులు