సోమవారం 01 మార్చి 2021
Siddipet - Oct 09, 2020 , 01:16:42

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు

సిద్దిపేట టౌన్‌ : తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి తో డ్పాటు అందిస్తుందని సిద్దిపేట గంగపుత్రుల సంఘం సభ్యులు అ న్నారు. గురువారం ఎర్రచెరువులో చేపలు పడుతూ సంబురపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది మంత్రి హరీశ్‌రావు చెరువులో చేపపిల్లలు వదిలారని చెప్పారు. అవి నేడు పెద్దవై జీవనోపాధి పొందుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో 450 మంది సంఘ సభ్యులున్నారని మంత్రి హరీశ్‌రావు కృషితో చేపల వ్యాపారం చేస్తూ తామందరం జీవనోపాధి పొందుతున్నామన్నారు. ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.  

VIDEOS

తాజావార్తలు


logo