బుధవారం 03 మార్చి 2021
Siddipet - Oct 09, 2020 , 01:16:42

అత్యవసర సమయాల్లో పోలీసుల రక్తదానం

అత్యవసర సమయాల్లో పోలీసుల రక్తదానం

సిద్దిపేట టౌన్‌ : అత్యవసర సమయాల్లో మేమున్నామంటూ ముందడుగు వేస్తున్నారు మన పోలీసన్నలు. శాంతిభద్రతల పర్యవేక్షణతో పాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో పోసాన్‌పల్లి గ్రామానికి చెందిన సుజాత అనే బాలిక ఆపరేషన్‌ కోసం బీ పాజిటివ్‌, రోడ్డు ప్రమాదంలో గాయపడిన బలరామ్‌కు అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరమని వైద్యులు సూచించారు. ఈ మేరకు సిద్దిపేట టూటౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తిరుపతిలు ఫోన్‌ మేసేజ్‌ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. సిద్దిపేట బ్లడ్‌ బ్యాంకుకు వెళ్లి రక్తాన్ని దానం చేశారు. కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు, వైద్యులు ప్రత్యేకంగా అభినందించారు.

VIDEOS

logo