గడువులోగా సర్వేను పూర్తి చేయాలి

- కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
గజ్వేల్/ గజ్వేల్‌అర్బన్: దేశంలో పట్టణ ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని మొట్టమొదటి సారిగా సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రయత్నమని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ ఐవోసీలోని గడా సమావేశ మందిరంలో మున్సిపల్ పరిధిలోని ఆస్తుల నమోదు బృందాలతో కలెక్టర్ సమీక్షించారు. ఆస్తుల నమోదును వేగవంతం చేయాలని, అందుకు అవసరమైన చర్యలపై ఆయన బృందాల సభ్యులకు సూచనలు ఇచ్చారు. ఆస్తులను ధరణియాప్లో పొందుపర్చడం ద్వారా భద్రత ఉంటుందన్నారు. ప్రజా భాగస్వామ్యంతో, పక్కా ప్రణాళికతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఆస్తుల నమోదును చేపట్టి ఐదు రోజుల్లో వందశాతం ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యం సాధించకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్తుల నమోదు ప్రక్రియ పురోగతిని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ దీపక్ తివారీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రోజువారీ నివదికను అందించాలని కలెక్టర్ సూచించారు. మృతి చెందిన వ్యక్తిపేరు మీదున్న ఆస్తులు, రికార్డు సక్రమంగా లేని, వివాదంలో ఉన్న ప్రాపర్టీ వివరాలను ప్రత్యేకంగా సేకరించాలన్నారు. ధరణియాప్లో వివరాలు నమోదు చేసే క్రమంలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తితే వెంటనే పై అధికారులకు తెలియజేయాలని తులిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బెజ్జంకిలో..
బెజ్జంకి : ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న ఇండ్ల సర్వేను గడువులోగా పూర్తి చేయాలని డీపీవో సురేశ్‌బాబు అన్నారు. మండల కేంద్రంలో చేపట్టిన ఇంటి సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంపీడీవో రఘువేంద్రరెడ్డి అధికారులు ఉన్నారు.
వర్గల్లో..
వర్గల్ : మండలంలోని తున్కిఖల్సా, చౌదర్పల్లి, వేలూర్, నెంటూర్, వర్గల్, అంబార్‌పేట, మీనాజీపేట, సామలపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ఇండ్లనిర్మాణాల లెక్కింపు ముమ్మరంగా కొనసాగుతున్నది. మండల ఎంపీడీవో మేరిస్వర్ణకుమారి, ఏపీవో నందకిశోర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు మండలంలో ఇండ్లు, గుడి గోపురాలు ఇతర నిర్మాణాలతో కలిపి 11వేల వరకు ఉండగా వీటిలో 3 వేల నిర్మాణాల లెక్క పూర్తయినట్లు ఎంపీడీవో స్వర్ణకుమారి తెలిపారు.
మండలానికి 11026 బతుకమ్మ చీరలు
మండలంలోని 27 గ్రామపంచాయతీలకు ఈ సారి బతుకమ్మ పండుగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మండల ఆడపడుచులకు 11026 చీరలను పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. శుక్రవారం వరకు గ్రామాలకు చీరలను చేరవేయనునుట్లు వెల్లడించారు.
జగదేవ్‌పూర్‌లో..
జగదేవ్‌పూర్ : ఆస్తుల సర్వే వేగంగా కొనసాగుతుందని ఈసర్వే ప్రక్రియకు ప్రజలు అధికారులకు సహకరించాలని ఎంపీడీవో మల్లిఖార్జున్ అన్నారు. గురువారం మండలంలోని మునిగడప, తిమ్మాపూర్ తీగుల్ గ్రామాల్లో ఎంపీవో శ్రీనివాస్‌వర్మతో కలసి ఆయన పర్యటించారు. సర్వే ప్రక్రియను పరిశీలించి పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో జరుగుతన్న పల్లె ప్రగతి కార్యక్రమాలకు సహకరించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మురళీకృష్ణ, లావణ్య, సర్పంచ్‌లు భానుప్రకాశ్‌రావు, బాల్లక్ష్మ య్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- పెట్రో ధరల పెంపుపై ఎంపీ శశిథరూర్ వినూత్న నిరసన.. వీడియో
- పరపతి వ్యవస్ధలో పారదర్శకతకు చర్యలు : నరేంద్ర మోదీ
- ఏకంగా పోలీస్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు
- పాక్ క్రికెటర్ అక్మల్‌కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్‌కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్‌షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి