గులాబీ దళంలోకి చేరికల జోష్

- టీఆర్ఎస్లో చేరుతున్నకాంగ్రెస్, బీజేపీ క్యాడర్
- ఖాళీ అవుతున్న ప్రతిపక్ష పార్టీలు
- కాంగ్రెస్‌లో రగులుతున్న అసమ్మతి
- పరువు పోగొట్టుకున్న బీజేపీ..
- నేడు, రేపు మరికొంత మంది టీఆర్ఎస్లో చేరే అవకాశం
సిద్దిపేట, నమస్తే తెలంగాణ : దుబ్బాక ఉప ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులను ఖరారు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతను సీఎం కేసీఆర్ ఖరారు చేసి పార్టీ బీ-ఫాం అందించారు. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు జోష్ మీద ఉన్నారు. ఉద్యమ నేత కుటుంబానికే టికెట్టు ఇవ్వడంతో టీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. సోలిపేట సుజాత రెండు రోజుల నుంచి గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని ఆపార్టీ అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ అభ్యర్థిగా గత సాధారణ ఎన్నికల్లో పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావుకు టికెట్టు ఇచ్చారు. టికెట్లు కేటాయింపు పూర్తి కావడంతో కాంగ్రెస్, బీజేపీలో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. ఆ పార్టీ నాయకుల తీరుపై సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆపార్టీ, నాయకుల తీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు సమక్షంలో భారీగా చేరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అసమ్మతి...
దుబ్బాక నియోజకవర్గంలో అంతంతగానే ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రగులుతున్నది. పార్టీని పట్టుకొని ఉన్న వారికి కాకుండా నిన్న మొన్న వచ్చిన వారికి టికెట్టు ఇవ్వడంపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉండి, పార్టీ జెండామోసిన వారికి కాకుండా, రాత్రికి రాత్రి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం స్థానిక నాయకుల మాటలకు విలువ ఇవ్వడం లేదని తమ అసంతృప్తిని బహిరంగగానే వెల్లగక్కుతున్నారు. గత సాధారణ ఎన్నికల్లో సుమారుగా 25 వేల ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చాయని, ఈసారి కనీసం 10 వేల ఓట్లు కూడా రావని ఆ పార్టీ నాయకులే బల్లగుద్ది చెబుతున్నారు. దీంతో దుబ్బాక నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధ్దమవుతున్నారు.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు టీఆర్ఎస్లో చేరారు. వీరంతా మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు.
మొన్నటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన మద్దుల నాగేశ్వర్రెడ్డితో పాటు ఆయన అనుచరులు టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. వీరు కాకుండా నియోజకవర్గంలో ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు రోజలు కిందట సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, గొడుగుపల్లి ఎంపీటీసీ లక్ష్మీనర్సవ్వ, చీకోడ్ ఎంపీటీసీ రాంరెడ్డి, మిరుదొడ్డి ఎంపీటీసీ సుతారి నర్సింహులు, తిమ్మాపూర్ ఎంపీటీసీ మాధవి తదితరులు వారి అనుచరులతో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు చెబుతున్నారు. ఇలా రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వలసల జోరు మరింతగా కొనసాగుతున్నది. ఉన్న కార్యకర్తలను కాపాడుకోవడానికి గ్రామానికి ఒక రాష్ట్ర నాయకుడిని కాంగ్రెస్ ఇన్చార్జిలుగా నియమించింది. బయట నుంచి వచ్చిన నాయకుల హడావిడి తప్ప, స్థానిక నాయకుల మద్దతు పార్టీకి కరువైందని చెప్పవచ్చు.
పరువు పోగొట్టుకుంటున్న బీజేపీ...
క్రమ శిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకునే బీజేపీ, తన సిద్ధ్దాంతాలను పక్కన బెట్టిందని ఆ పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు తలలు పట్టుకుంటున్నారు. గత సాధారణ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ, ఈసారి గెలవడానికి అప్పుడే డబ్బు సంచులను దించుతున్నది. కనీసం గ్రామాల్లో క్యాడర్ లేదు...సోషల్ మీడియాలో హడావిడి తప్ప.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఆదరణ, బలం లేదు. అలాంటి పార్టీ గెలుస్తామని చెప్పకుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. గ్రామాల్లో ఆ పార్టీని నిలదీస్తున్నారు. ఇక పార్టీ అభ్యర్థిగా రఘునందన్‌రావును ఖరారు చేయడంతో పార్టీ తీరుపై, అభ్యర్థిపై సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. కార్పొరేట్ ైస్టెల్ ఇక్కడ పనికి రాదని, వంద కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా బీజేపీ గెలవదని వాళ్ల క్యాడరే విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో అయా మండలాల్లో నుంచి బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరిపోతున్నారు. దీంతో కమలం పార్టీ కలవరానికి గురవుతున్నది.
తాజావార్తలు
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- కందకుర్తి సరిహద్దులో ఇంజక్షన్ కలకలం
- మార్కాపురంలో ఎన్నికల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం.!
- బెంగాలీ నటుడికి నాని టీం వెల్కమ్