టీఆర్ఎస్ ముమ్మర ప్రచారం

చేగుంట: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. మండల పరిదిలోని కసాన్పల్లి, మక్కరాజిపేట, రెడ్డిపల్లి తదితర గ్రామాల్లో బుధవారం సర్పంచ్‌లు గ్రామ ఇన్చార్జిలతో కలిసి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఉప ఎన్నికల్లో దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నర్సవ్వశ్రీకాంత్రెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, కాశగోని లక్ష్మీ, ఎంపీటీసీ బండి కవితవిశ్వేశ్వర్, హత్నూర ఎంపీపీ నర్సింహులు, ఉప సర్పంచ్ గంగారెడ్డి, దామోదర్‌రెడ్డి, వెంకటస్వామి, శ్రీకాంత్‌యాదవ్, నీలంరెడ్డి, యూత్ సభ్యులు తదితరులున్నారు.
ప్రతిపక్షాలకు డిపాజిట్లు రావు
తొగుట: దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని గ్రేటర్ హైదరాబాద్ జాగృతి అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, మునిపల్లి జడ్పీటీసీ సాయికుమార్, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీపీలు ఎడ్ల సోమిరెడ్డి, జాప శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తుక్కాపూర్, వెంకట్రావుపేట, కాన్గల్‌లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. డిపాజిట్లు రాని ప్రతిపక్ష నాయకుల వలలో యువకులు పడవద్దని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాన్గల్‌లో గంగపుత్రులు టీఆర్ఎస్కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం అందించారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కంకణాల నర్సింహులు, మునిపల్లి సీనియర్ నాయకులు శివశంకర్, భాగయ్య, భూమయ్య, నంగునూరు మండల నాయకులు వేముల కొండల్‌రెడ్డి, వేణుగోపాలచారి, దశమంతారెడ్డి, వెంకటేశం, తిరుపతి, లతా కృష్ణ, పర్శరాములు, నర్సింహారెడ్డి, కనకయ్య, తిరుపతి, రమేశ్, గఫార్, నాయకులు పిట్ల వెంకటయ్య, క్యాస అంజనేయులు, డబ్బికారి పెంటోజి, బండారు స్వామిగౌడ్, వెంకటేశం, సుతారి రాములు, రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన పలువురి ఇతర పార్టీల నేతలు
దౌల్తాబాద్: టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు అమలు తీరును చూసి పలువురు ఇతర పార్టీల నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. బుధవారం గొడుగుపల్లి ఎంపీటీసీ లక్ష్మీనర్సవ్వ, తనయుడు అమరేందర్‌రెడ్డి దుబ్బాక ఉప ఎన్నికల దౌల్తాబాద్ మండల ఇన్చార్జి, వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. అంతకుముందు వారు గ్రామం నుంచి 300 మందితో కలిసి దుబ్బాక వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, గ్రామ సర్పంచ్ శివకుమార్, జిల్లా కోఆప్షన్ నాయకులు రహిమొద్దీన్, టీఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి, చిందం రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని దుబ్బాక ఉప ఎన్నికల దౌల్తాబాద్ మండల ఇన్చార్జి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోనాపూర్‌లో వివిధ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు ప్రతాప్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ పంచామి స్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ గ్రామ ఇన్చార్జి గజ్వేల్ మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, ఎంపీటీసీ నవీన్, ఉప సర్పంచ్ రాజిరెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..
- పోలింగ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు
- వాణీదేవిలోనే పీవీని చూస్తున్నాం..