సోమవారం 01 మార్చి 2021
Siddipet - Oct 08, 2020 , 01:16:52

తనిఖీల్లో రూ.2 లక్షలు పట్టివేత

తనిఖీల్లో రూ.2 లక్షలు పట్టివేత

మిరుదొడ్డి : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్‌పేటలో బుధవారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో రూ.2 లక్షల నగదును పోలీసులకు పట్టుకున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల పోలీస్‌ నోడల్‌ అధికారి, సిద్దిపేట ట్రాఫిక్‌ ఏసీపీ బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం... దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బుధవారం ఉదయం 5 గంటల

సమయంలో పోలీస్‌ సిబ్బంది రహదారుల వెంట ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు చేపట్టారు. ములుగు జిల్లాలోని సింగారం కుంట గ్రామానికి చెందిన సీహెచ్‌ రాజేం దర్‌, అతడి తండ్రి మొగిలయ్యతో కలిసి కారులో రూ.2 లక్షల తీసుకొని రామాయంపేట వైపు వెళ్తున్నారు. 6.30 గంటల సమయంలో అక్బర్‌పేట చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు రాజేందర్‌ కారులో రూ.2 లక్షల నగదు దొరికింది. ఆ డబ్బులకు సంబంధించి పత్రాలు వారి వద్ద ఏమీ లేవు. దీంతో రూ.2 లక్షల డబ్బులు, కారును సీజ్‌ చేశారు. రూ.2 లక్షల డబ్బులకు సంబంధించి పత్రాలను చూపించి,ఆ డబ్బులను తీసుకెళ్లాలని వారికి సూచించినట్లు ఏసీపీ తెలిపారు.   

VIDEOS

తాజావార్తలు


logo