శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 08, 2020 , 01:16:52

అనుమతి ఉంటేనే.. ప్రచారం

అనుమతి ఉంటేనే.. ప్రచారం

  • దుబ్బాక ఉప ఎన్నిక  నేపథ్యంలో ఆంక్షలు
  • రాజకీయ ప్రచార ప్రకటనల  ప్రసారానికి  తప్పనిసరిగా  అనుమతులు తీసుకోవాలి
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

  సిద్దిపేట కలెక్టరేట్‌ : దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అడ్వర్టజ్‌మెంట్లు, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలో ప్రసారం చేసే వీడియో అడ్వర్టజ్‌మెంట్లకు, బహిరంగ ప్రదేశాల్లో వీడియో విజువల్‌ ప్రదర్శనకు ముందస్తుగా జిల్లా మీడియా సర్టిఫికెట్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ నుంచి అనుమతులు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి వివిధ వార్త్తా పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చే పెయిడ్‌ న్యూస్‌ గుర్తింపునకు ఎంసీఎంసీ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.

  ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాల్లో ప్రసారమయ్యే కథనాలను పరిశీలించి, అతిక్రమణలు జరిగితే  చర్యలు తీసుకుంటుందన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారమయ్యే అన్ని రకాల రాజకీయ ప్రచార ప్రకటనలను ఎంసీఎంసీ కమిటీ నుంచి ముందస్తుగా అనుమతి పొందాలని, పోలింగ్‌ రోజు, ముందు రోజు ప్రచురితమయ్యే ప్రింట్‌ మీడియా ప్రకటనలకు కూడా అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. దుబ్బాక అసెం బ్లీ స్థానానికి పోటీచేసే అభ్యర్థులకు మాత్రమే జిల్లా ఎంసీఎంసీ కమిటీ తో రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి జారీ చేస్తామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిష్టర్‌ అయిన పార్టీల ప్రకటనలకు సం బంధించి రాష్ట్రస్థాయి ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు జిల్లా ఎంసీఎంసీకి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 

 అనుమతి లేని ప్రకటనలను  కేబుల్‌, శాటిలైట్‌ చానెల్స్‌ ప్రసారం చేయవద్దు.. 

జిల్లా మీడియా సర్టిఫికెట్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ నుంచి అనుమతులు లేని రాజకీయ ప్రకటనలు కేబుల్‌, శాటిలైట్‌, ఇతర చానెల్స్‌ ద్వారా ప్రచారం చేయవద్దని  పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలక్ట్రానిక్‌ మా ధ్యమాలు, అభ్యర్థులపై ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. 

ఎన్నికల ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉండండి... 

నోటిఫికేషన్‌కు మూడు రోజుల సమయం ఉందని, ఎన్నికల ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, సంబంధిత పత్రాలు లేకుండా పరిమితికి మించి నగదు తీసుకెళ్తే సీజ్‌ చేయాలని సూచించారు. అనుమతి లేకుండా జెండాలు పెట్టుకొని ప్రచారం చేసే వాహనాలను గుర్తించి సీజ్‌ చే యాలని, అధికారులు నిర్భయంగా, నిష్పక్షపాతంగా వి ధులు నిర్వర్తించాలని, ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయు త వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. 

ఎన్నికల కమిటీలకు  బాధ్యుల నియామకం 

1) లా అండ్‌ ఆర్డర్‌, డిస్ట్రిక్‌ సెక్యూరిటీ ప్లాన్‌, ఎస్‌ఎంఎస్‌ మానిటరింగ్‌, కమ్యూనికేషన్‌ ప్లాన్‌ కమిటీ   - సీపీ జోయల్‌ డెవిస్‌

2) ఈవీఎం, వీవీప్యాడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ- టీమ్‌ హెడ్‌గా   హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి, సభ్యుడిగా అబ్దుల్‌   రెహమాన్‌(తహసీల్దార్‌ హుస్నాబాద్‌), శ్రీనివాస్‌ ఐటీ 

సపోర్టర్‌గా కలెక్టరేట్‌, సపోటింగ్‌ స్టాఫ్‌గా అన్వర్‌ (తహసీల్దార్‌), శ్రీనివాస్‌, గోపాల్‌ (నయాబ్‌ తహసీల్దార్‌), భిక్షపతి (సీనియర్‌ అసిస్టెంట్‌ కలెక్టరేట్‌), 

3) మ్యాన్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ పోలింగ్‌ పర్సనల్‌ మైక్రో అబ్జర్వర్‌   కమిటీ - హెడ్‌గా జయచంద్రారెడ్డి (ఆర్డీవో),సభ్యులు శ్రవణ్‌కుమార్‌, చరణ్‌దాస్‌, రవి కాంతారావు,   జీవరత్నం, నగేశ్‌, అశోక్‌లాల్‌, రాజేందర్‌, అశ్విని, అశోక్‌,   రాజమహేంద్ర

4) మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కమిటీ - హెడ్‌ జయచంద్రారెడ్డి,   సభ్యులు సత్యప్రసాద్‌రెడ్డి, అన్వర్‌, హఫీజ్‌

5) సీప్‌ యాక్టివిటీస్‌ కమిటీ - హెడ్‌గా జయచంద్రారెడ్డి, సభ్యులు - శ్రవణ్‌ (జడ్పీ సీఈవో), రాంగోపాల్‌రెడ్డి,  జరీనాబేగం, దుబ్బాక రిటర్నింగ్‌ ఆఫీసర్‌, దుబ్బాక ఏఆర్‌వోలు

6) హెల్ప్‌లైన్‌, ఫిర్యాదులు, డీసీసీఎన్‌జీఎస్‌పీ, సీ-విజిల్‌ ఫిర్యాదులు ఇన్‌ ప్రెస్‌ కమిటీ హెడ్‌గా జయచంద్రారెడ్డి,     మహేశ్‌, రాజమహేంద్ర, రామచందర్‌, పద్మాకర్‌,   సీ-విజిల్‌ సభ్యులుగా ప్రజ్వల, మధు, నవీన్‌, అరుణ్‌,     రేణుక, గణేశ్‌

7) మీడియా కమ్యూనికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ పి.చెన్నయ్య (రిటర్నింగ్‌ ఆఫీసర్‌ దుబ్బాక అసెంబ్లీ),  దశరథం (డీపీఆర్‌వో), నాగరాజు, రాజు, ఆనంద్‌కుమార్‌

8) ట్రైనింగ్‌ మేనేజ్‌మెంట్‌ పోలింగ్‌ స్టాఫ్‌ టీమ్‌ : హెడ్‌గా జయచంద్రారెడ్డి, స్టేట్‌ లెవల్‌ మాస్టర్‌ ట్రైనర్‌ అయోధ్యరెడ్డి, రమేశ్‌రావు, దుబ్బాకలో శిక్షణ తిరుపతి, చక్రపాణి, శ్రీహరి, ఉమాశంకర్‌, శారదప్రసాద్‌,  భాస్కర్‌, డిస్ట్రిక్‌ లెవల్‌ మాస్టర్‌ ట్రైనర్‌ టీమ్‌  హెడ్‌ అనంతరెడ్డి (ఆర్డీవో సిద్దిపేట), చరణ్‌దాస్‌, డిస్ట్రిక్‌ ట్రైనర్స్‌ అయోధ్యరెడ్డి రమేశ్‌రావు, సిద్దిపేట ట్రైనర్స్‌ సత్యనారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, రాజిరెడ్డి, గజ్వేల్‌ ట్రై నర్స్‌ షేక్‌ హఫీజొద్ద్దీన్‌, బ్రహ్మానందం, కరుణాకర్‌, వెంకటేశ్‌.

9) ఐటీ ఇన్‌ఫాస్ట్రక్చర్‌ అండ్‌ ఈసీఐ ఐటీ రిలేటెడ్‌ అప్లికేషన్‌ మానిటరింగ్‌ టీమ్‌   -   హెడ్‌గా జయచంద్రారెడ్డి, ఆనంద్‌కుమార్‌, డిస్ట్రిక్‌ ఎన్‌ఐసీ టీమ్‌

10) ఎక్స్‌టెండింగ్‌ ఫొటోకాల్‌ టు అబ్జర్వర్స్‌ కమిటీ  - హెడ్‌గా అనంతరెడ్డి (ఆర్డీవో సిద్దిపేట), సభ్యులు - తహసీల్దార్‌ సిద్దిపేట అర్బన్‌, తహసీల్దార్‌ చిన్నకోడూరు, వెంకయ్య, రవీందర్‌రెడ్డి, మనోజ్‌కుమార్‌

11) ఇన్‌చార్జి ఫర్‌ ప్రింటింగ్‌ ఆఫ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ అండ్‌  ఈవీఎం బ్యాలెట్‌ పేపర్‌ కమిటీ    :     టీమ్‌ హెడ్‌గా జయచంద్రారెడ్డి, సభ్యులు - గోపాల్‌రావు,    వెంకటరమణ, తహసీల్దార్‌ రామచందర్‌, పద్మాకర్‌, నాగేందర్‌, రమేశ్‌, శ్రీనివాస్‌

12) వెబ్‌ కాస్టింగ్‌ టీమ్‌ : హెడ్‌గా జయచంద్రారెడ్డి, శ్రవణ్‌కుమార్‌, ఆనంద్‌కుమార్‌, సందీప్‌, అన్వర్‌హఫీజ్‌, 

13) ట్రాన్స్‌పోర్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ :  ఆర్టీవో సిద్దిపేట, రిటర్నింగ్‌  ఆఫీసర్‌ దుబ్బాక, రామేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట ఆర్టీసీ డివిజినల్‌ మేనేజర్‌  సిద్దిపేట, రామచందర్‌, పద్మాకర్‌, 

జోసెఫ్‌, జనార్దన్‌రెడ్డి, చంద్రయ్య

14) ఎక్స్‌పెండెంచర్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ కంటెస్టింగ్‌ క్యాండెడ్‌  అండ్‌ పోలింగ్‌ పార్టీస్‌ టీమ్‌ - హెడ్‌గా జయచంద్రారెడ్డి, సభ్యులుగా శ్రీనాథ్‌, నర్సింహారావు,  రామచందర్‌,

 పద్మాకర్‌, శ్రీకాంత్‌, రమేశ్‌, వెంకటేశ్‌, స్వామి

15) ఎలక్షన్‌ బడ్జెట్‌ అండ్‌ సబ్‌మిషన్‌ ఆఫ్‌ బిల్స్‌ కమిటీ - హెడ్‌గా జయచంద్రారెడ్డి(హుస్నాబాద్‌ ఆర్డీవో), సభ్యులుగా ఉమారాణి, దయాసాగర్‌, శ్యామల

16) క్యాష్‌ సీజర్‌ టీమ్‌ : హెడ్‌గా జయచంద్రారెడ్డి, సభ్యులుగా  మనోజ్‌కుమార్‌, బాల్‌రాజు, ఉమారాణి,  దయాసాగర్‌, శ్యామల బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 


VIDEOS

logo