కమలంలో కల్లోలం!

- దుబ్బాకలో బీజేపీ రెండు ముక్కలు
- అభ్యర్థి ప్రకటనతో ఒక్కసారిగా బయటపడిన అసమ్మతి
- రేపిస్టుకు టికెట్టు ఇవ్వడం పార్టీ సిద్ధాంతమా..?
- రూ.వంద కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీకి ఓట్లు వేయరు
- బీజేపీ అభ్యర్థిపై సొంత పార్టీ నేతలే ఘాటు విమర్శలు
- రఘునందన్‌రావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న శ్రేణులు
దుబ్బాక బీజేపీ రెండు ముక్కలైంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేరును ప్రకటించడంతో ఆ పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి బయటపడింది. ఇన్ని రోజలు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బయట పడడంతో ఆ పార్టీ ఆగమవుతున్నది.
-సిద్దిపేట, నమస్తే తెలంగాణ -సిద్దిపేట, నమస్తే తెలంగాణ
‘ఎన్నికలు వస్తేనే కనిపించే నాయకుడికి టికెట్టు ఎలా ఇస్తారు..? పార్టీ సిద్ధ్దాంతాలను పక్కన పెట్టి ఒక రేపిస్టుకు టికెట్ ఇస్తే మనం ప్రజలకు ఏమి సమాధానం చెబుతాం..? ఏ మొఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు వేయమని అడుగుదాం..? మన అభ్యర్థి గొప్పతనాలు ఏమని చెప్పుతాం..? ఇవన్నీ చూడకుండా అవినీతిపరుడుకి టికెట్టు ఎలా ఇస్తారు?’ అంటూ సొంత పార్టీ నేతలే బీజేపీ రాష్ట్ర అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పేరును ప్రకటించడంతో ఆ పార్టీలో అసమ్మతి బయటపడింది. దీంతో దుబ్బాక బీజేపీ రెండు ముక్కలైంది. ఇన్ని రోజలు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బయట పడడంతో ఆ పార్టీ ఇలాంటి షాక్‌లను ఊహించలేక సతమతమవుతున్నది.
-సిద్దిపేట, నమస్తే తెలంగాణ
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీకి తలనొప్పులు అప్పుడే ప్రారంభమయ్యాయి. రెండు రోజుల కింద బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు సంబంధించిన రూ. 40 లక్షలు పట్టుబడ గా, ఇవాళ ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావుపై సొంత పార్టీ నేతలు ఘాటుగా విమర్శలు చేశారు. స్థానిక నేతలు, కార్యకర్తల మనోభావాలను లెక్క చేయకుండా కేంద్ర పార్టీకి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని సొంత పార్టీ నేతలు విమర్శనాస్త్రలు సంధిస్తున్నారు. స్థానిక పార్టీ కార్యకర్తల గురించి పట్టించుకొని నాయకుడికి టికెట్ ఇ వ్వడం సరికాదు..ఒక రేపిస్ట్టుకు టికెట్ ఎలా ఇస్తారు? అంటూ ఆ పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్‌రెడ్డి బుధవారం ఘాటు విమర్శలు చేయడంతో ఆ పార్టీ ఒక్కసారి గా అవాక్కయింది. పైగా బీజేపీలో రేపిస్టులకు టికెట్టు ఇచ్చే సం స్కృతి ఉందా? అని ప్రశ్నించారు. రేపు పొద్దుగాళ్ల మనం ఏ మోహం పెట్టుకొని ప్రచారం చేస్తాం.. మన అభ్యర్థి గొప్పతనా లు ఏమని చెప్పుతాం..? మహిళల రక్షణ విషయంలో మీ వైఖరి ఏమిటీ అని దుబ్బాక ప్రజలు నిలదీస్తే ఏమని సమాధా నం చెబుతామని పార్టీ పెద్దలను ఆయన ప్రశ్నించారు. పైగా దుబ్బాక నియోజకవర్గంలో ఒక ఆనవాయితీ ఉందని.. ఇక్కడ సాధారణంగా ఉండే నాయకు లకు మాత్రమే ఓట్లు వేస్తారని, కార్పొరేట్ ైస్టెల్ చూపించేవారికి, ఇక్కడ ఓట్లు వేయరని ఘం టాపథంగా చెప్పారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా దుబ్బాక ప్రజలు ఓట్లు వేయరన్నారు. ఓట్లను కొనుక్కునే పార్టీ కూడా మనది కాదని కమలాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీలో ఉన్న కొద్దిపాటి కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో పార్టీ నాయకులను కాపాడుకోవడానికి శతవిధాలా బీజేపీ ప్ర యత్నాలు చేస్తున్నది. దుబ్బాక నియోజకవర్గంలో నెల రోజు లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా స్పం దన లేదు. మీ ప్రభుత్వం మా బావుల కాడ మోటర్లకు మీటర్లు పెడుతారంట కదా, మీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని బీ జేపీ నాయకులను రైతులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మాకు ఏం చేశారని మీకు ఓటు వేయాలి... రైతుబంధు ఇచ్చారా.. పింఛన్ ఇచ్చారా..? ఏం ఇచ్చారని మీకు ఓటు వేస్తామంటూ ప్రజలు ప్రశ్నించడంతో మౌనమే సమాధానం అవుతున్నది. ఇదంతా ఒక్కటైతే.. ఎలాగైనా ఓట్లు కొనుగోలు చేయాలని డబ్బులు సిద్ధంగా చేసినట్లు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
తాజావార్తలు
- దేశవ్యాప్తంగా 10వేల కంపెనీల మూత.. ఎందుకంటే?!
- చికిత్స పొందుతూ యాసిడ్ దాడి బాధితురాలు మృతి
- మనువాడే వ్యక్తితో స్టైలిష్ ఫొటో దిగిన మెహరీన్
- దేశంలో కొత్తగా 15,388 కొవిడ్ కేసులు
- రైతు ఆందోళనలపై బ్రిటన్ ఎంపీల చర్చ.. ఖండించిన భారత్
- అమ్మమ్మ మాదిరిగా హావభావాలు పలికించిన సితార- వీడియో
- అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్