సిద్ధాంతాలు వదిలి చిల్లర రాజకీయాలు

సోషల్ మీడియాలో హడావిడి తప్ప క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్, ప్రజల నుంచి ఆదరణ లేక కాషాయ పార్టీ కిందామీద పడుతున్నది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ నాయకులు ‘చిల్లర’ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ఇంకా మొదలు కానే లేదు..! ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 9న రానున్నది. కానీ. బీజేపీ అప్పుడే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బుల సంచులను దించుతున్నది..! ఏకంగా రూ. 40 లక్షలను బీజేపీ నేత అనుచరులు దుబ్బాకకు తరలిస్తుండగా శామీర్‌పేట పోలీసులు పట్టుకోవడంతో ఈ తతంగం బయటపడింది. ఈ డబ్బులు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావుకు సంబంధించినవిగా పోలీసులు నిర్ధారించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు, కుల, యువజన సంఘాలను మచ్చిక చేసుకునేందుకు, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసేందుకు కమల నేతలు డబ్బులు తరలిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తమది జాతీయ పార్టీ, సిద్ధ్దాంతాలు కలిగిన పార్టీ అని చెప్పుకునే బీజేపీ నేతలు.. ఎంతగా దిగజారినారో ఈ ఘటనను బట్టి అర్ధమవుతున్నది. బీజేపీ తీరుపై అన్నివర్గాలు అసహ్యించుకుంటుండగా.. ఓటర్లు పెదవి విరుస్తున్నారు.
సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ఇంకా మొదలు కానే లేదు.. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 9న రానున్నది. కానీ బీజేపీ అప్పుడే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బుల సంచులను దించుతున్నది. ఏకంగా రూ.40 లక్షలను దుబ్బాకకు తరలిస్తుండగా, హైదరాబాద్‌లోని శామీర్‌పేట పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ డబ్బులు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావుకు సంబంధించినవిగా పోలీసులు నిర్ధారించారు. అప్పుడే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ నాయకులు డబ్బులను ఎరగా వేస్తున్నారు. తమది జాతీయ పార్టీ, సిద్ధ్దాంతాలు కలిగిన పార్టీ అని చెప్పుకునే బీజేపీ నేతలు, ఎంతగా దిగజారినారో ఈ ఘటనను బట్టి అర్థమవుతున్నది. మున్ముందు మరిన్ని డబ్బుల సంచులు తరలించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీజేపీలో చేరే వారికి ప్రత్యేక ప్యాకేజీలను సైతం అందిస్తున్నారు. కుల సంఘాలు, యువతకు డబ్బులు ఎరవేస్తున్నారు.
పక్కా ప్లాన్‌తో డబ్బుల ఎర.. సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే జాతీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఏకంగా నియోజకవర్గానికి పెద్దఎత్తున డబ్బుల సంచులను దించుతున్నది. ఓటర్లను నోట్లతో కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతున్నది. ముందస్తుగానే కావాల్సిన డబ్బులను నియోజకవర్గంలోని బీజేపీ నాయకుల ఇండ్లకు చేర్చే పనిలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాలకు డబ్బులను తీసుకు వస్తుండగా సోమవారం రాత్రి శామీర్‌పేట టోల్‌ప్లాజా వద్ద బీజేపీ నాయకులు రూ.40 లక్షలతో పట్టుబడిన విషయం తెలిసిందే. పటాన్చెరు నుంచి శామీర్‌పేట వైపు అనుమానాస్పదంగా వస్తున్న రెండు కార్లను పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో ఒక కారులో రూ.40 లక్షలు బయటపడ్డాయి. శ్రీనివాస్, మజీద్, ఆంజనేయులు అనే వ్యక్తులు పటాన్‌చెరుకు చెందిన వారు కాగా, సురేశ్ హైదరాబాద్ గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ డబ్బులను తీసుకువస్తూ వారు పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో ఈ డబ్బులు బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీచేయనున్న రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావుకు చెందినవి అని తేలింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో బీజేపీ నాయకులు డబ్బులను ఎరవేస్తున్నారు. సంచుల కొద్దీ డబ్బులను దుబ్బాక ప్రాంతానికి తరలిస్తున్నారు. నెల రోజులుగా దుబ్బాక ప్రాంతాంలో ప్రచారం నిర్వహిస్తున్న రఘునందన్‌రావు ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్యాకేజీలను నిర్ణయించి డబ్బులు ఎర చూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నియోజకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. కులసంఘాలు, యువతకు ప్యాకేజీలు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్యాడర్ లేక.. ప్రజల నుంచి ఆదరణ కరువై..
దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీకి అంతగా బలం లేదు. క్యాడర్ అంతంతే. 2018 సాధారణ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన రఘునందన్‌రావు అప్పట్లో మూడోస్థానంలో నిలిచారు. అలాంటిది ఈసారి గెలుపు తనదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల గ్రామాల్లో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగాన్ని ప్రజలు అడ్డుకున్నారు. మీరు ఓట్లు వేయకపోతే వేయకుండ్రి. కానీ, నేను చెప్పేది వినండి అని ఆయన ప్రజలకు మొర పెట్టుకున్నారు. ఏం చేశారని ఓట్లు అడగానికి వస్తున్నారంటూ బీజేపీ నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలప్పుడే ఓట్లు అడగడానికి వస్తారు.. ఆ తర్వాత ఏ ఒక్కరు కనిపించరు అంటూ మండిపడుతున్నారు. బీజేపీ నాయకులే ఆ పార్టీ నాయకుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల రాజక్కపేట గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త ఆ పార్టీ తీరును ఎండగట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాలుగైదు రోజలు కిందట దుబ్బాక బీజేపీ కార్యాలయం నుంచి ఓటర్లకు ఫోన్ చేసి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరగా, సదరు ఓటరు నుంచి వచ్చిన జవాబుతో ఒక్కసారిగా అవాక్కై కాల్ చేసిన వ్యక్తి ఫోన్ పెట్టేసింది. ఇలా.. ఎక్కడికక్కడ ప్రజలు బీజేపీ నాయకులను నిలదీస్తున్నారు. ఆయా మండలాలకు చెందిన ముఖ్య బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామాలు చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో బీజేపీకి అప్పుడే ఊహించని షాక్ తగులుతున్నాయి. ఇదంతా చూసిన బీజేపీ నాయకులు చేసేదేమి లేక డబ్బుల సంచులను నియోజకవర్గానికి దింపుతున్నారు.
తాజావార్తలు
- ఎన్ఎస్ఈలో లోపం ఊహించలేదు.. బట్ భారీ మూల్యం చెల్లించాం!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!