ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Oct 05, 2020 , 00:46:08

స్వచ్ఛతకు మారుపేరు ’విజయ’ డెయిరీ

స్వచ్ఛతకు మారుపేరు ’విజయ’ డెయిరీ

*  ఆదరిస్తున్న వినియోగదారులు

*  మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్న విజయ డెయిరీ

సిద్దిపేట అర్బన్‌ : ఆరోగ్యమే మహాభాగ్యము... స్వచ్ఛమైన, నాణ్యమైన అమృతం లాంటి పాలు, పాల పదార్థ్ధాలు అందిస్తున్న సిద్దిపేటలోని విజయ డెయిరీ జిల్లాకే ఆదర్శంగా నిలుస్తోంది.   ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో సిద్దిపేట విజయ పాలడెయిరీ రూ.5 కోట్ల టర్నోవర్‌తో జిల్లాలో ని వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ పాడిరైతులకు అండగా నిలుస్తోంది. ప్రభుత్వ  ఆధ్వర్యంలో కొనసాగుతున్న విజయ డెయిరీని అభివృద్ధి  చేసేందుకు మంత్రి ప్రత్యేక దృష్టి సారించడంతో పాల డెయిరీ దిన దినాభివృద్ధి చెందుతున్నది. మార్కెట్లో విజయ పాలు, వినియోగదారులకు అందుతున్నాయి. ఇప్పటివరకు ప్రైవేటుకు మాత్రమే పరిమితమైన పాల ప్యాకెట్లు ప్రస్తుతం ప్రభుత్వరంగ సంస్థ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ద్వారా  సిద్దిపేట విజయ డెయిరీ ఆధ్వర్యంలో వినియోగదారులకు నాణ్యమైన, స్వచ్ఛమైన పాలు, పాల ప్యాకెట్లు, పాల పదార్థ్ధాలు అందించేందుకు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నా రు. గతంలోనే  రూ. 94 లక్షల నిధులతో సిద్దిపేట విజయ డెయిరీలోఆధునిక యంత్రాలు ఏర్పాటు చేశారు. 1985లో సిద్దిపేటలో విజ య డెయిరీని ఏర్పాటు చేశారు. సిద్దిపేట విజయ డెయిరీకి ప్రస్తుతం 493 గ్రామాల ద్వారా పాడి రైతులనుంచి రోజుకు 30 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం 400 లీటర్లు  పాల ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. సిద్దిపేట విజయ డెయిరీ వద్ద ప్ర తి రోజూ సుమారు 300 లీటర్ల పాలను విక్రయిస్తున్నారు. లీటరుకు రూ.62కు అమ్ముతున్నారు. 

  రూ.4 ఇన్సెంటీవ్‌ అందిస్తున్న ప్రభుత్వం

పాడి రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విజయ డెయిరీ పాడి రైతులకు ప్రతి లీటరు పాలకు అదనంగా రూ. 4 ఇన్సెంటీవ్‌ను అందిస్తున్నది. కొంత కాలంగా బకాయి ఉన్న రూ.7,40,65, 635ల ప్రోత్సాహకాన్ని రైతుల ఖా తాల్లో ప్రభుత్వం జమ చేసింది. దీంతో విజయ డెయిరీ పాడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 స్వచ్ఛమైన పాలు అందిస్తున్నాం

మంత్రి  హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో వినియోగదారులకు స్వచ్ఛమైన పాలు అందించడమే విజయ డెయిరీ లక్ష్యం.  విజయ డెయిరీలో పాల ఉత్పత్తిని పెంచేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నాం. నాణ్యమైన పాలు అందించడంతో పాటు పాడి రైతులకు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో పలు పథకాలను అందిస్తున్నాం. ఇటీవల పాడి రైతులకు అందాల్సిన ఇన్సెంటీవ్‌ను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

       -గనప లక్ష్మారెడ్డి , జిల్లా చైర్మన్‌, సిద్దిపేట విజయ డెయిరీ


VIDEOS

logo