నాడు రాజగోపాల్‌పేట సెగ్మెంట్.. నేడు దుబ్బాక నియోజకవర్గం

సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్ఎస్)- 89,299 ఓట్లు (54.36 శాతం)
మద్దుల నాగేశ్వర్ రెడ్డి (కాంగ్రెస్)- 26,799 ఓట్లు (16.31 శాతం)
రఘునందన్‌రావు- (బీజేపీ) 22,595 ఓట్లు (13.75 శాతం) సాధించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 62,500 (38.04శాతం) ఓట్ల మెజార్టీ సాధించారు.
సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక నియోజకవర్గాన్ని మొదట్లో రాజగోపాల్‌పేట పేరు మీద పిలిచే వారు. 1951లో తొలిసారిగా ఇక్కడ మోడల్ ఎన్నికలు నిర్వహించారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కేవీ నారాయణరెడ్డి కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచారు. 1957 ఎన్నికల్లో పీడీఎఫ్ తరపున వంగ హన్మంతరెడ్డి (ఆశిరెడ్డి)గెలిచారు.
దొమ్మాటగా మార్పు...
1957లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రాజగోపాల్‌పేట నియోజకవర్గం దొమ్మాట నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 1962లో ఎంకే మోహినొద్ద్దీన్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. 1967లో ఎం.భీమిరెడ్డి స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచారు. 1972లో దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), 1978లో ఐరేని లింగయ్య (కాంగ్రెస్), 1983లో ఐరేని లింగయ్య (కాంగ్రెస్), 1985 మధ్యంతర ఎన్నికల్లో రామచంద్రారెడ్డి (టీడీపీ) గెలుపొందారు. 1989, 1994, 1999లో చెరుకు ముత్యంరెడ్డి (టీడీపీ) నుంచి గెలుపొందారు. 2004లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన జర్నలిస్టు నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2008 ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దొమ్మాట నియోజకవర్గం దుబ్బాకగా మారింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి తరపున చెరుకు ముత్యంరెడ్డికి టీడీపీ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ముత్యంరెడ్డి విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 37,925 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసిన సోలిపేట రామలింగారెడ్డ్డి సమీప ప్రత్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డిపై 62,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దుబ్బాక నుంచి రామలింగారెడ్డి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో రామలింగారెడ్డి విజయం రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 7వ స్థానం ఈయనది. తిరిగి రెండోసారి అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్‌గా కూడా ఎన్నికయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసేవ చేశారు. అనారోగ్యంతో ఆగస్టు 6న రామలింగారెడ్డి మృతిచెందారు. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది.
తాజావార్తలు
- నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ..విజయసాయిరెడ్డి సెటైర్లు
- తొండంతో ఏనుగు దాడి.. జూ కీపర్ మృతి
- పది సినిమాలను రిజెక్ట్ చేసిన సమంత.. !
- నెటిజన్లకు మంత్రి కేటీఆర్ ప్రశ్న
- ప్రధాని మోదీ పేదలకు పనికిరానివాడు: రాహుల్‌గాంధీ
- ఒక్క కరోనా కేసు.. వారం రోజుల లాక్డౌన్
- శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సెంచరీ
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్ వేదిక మారనుందా?
- నవ్వుతూ వీడియో తీసి.. ఆత్మహత్య చేసుకుంది..
- ఫేక్ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోషన్ వాంగ్మూలం