ఏమిచేశారని బీజేపీ వాళ్లు ఓట్లడుగుతారు..

రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్రం
కేంద్ర విధానాలు నచ్చకే ఎన్డీయే కూటమిని వీడుతున్న మిత్రపక్షాలు
రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్దపీట
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
మిరుదొడ్డి: తెలంగాణలో సీఎం కేసీఆర్ సర్కార్ ఆరేండ్లలోనే నూరేండ్ల అభివృద్ధి చేసి చూపించారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేలోని వెలమ ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మిరుదొడ్డి మాజీ జడ్పీటీసీ నర్మాల చంద్రం, గౌడ సంఘం అధ్యక్షుడు నేరండ్ల రాజాగౌడ్, చెప్యాల మాజీ సర్పంచ్ కమల బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ మస్కట్ బాల్‌రెడ్డి (భార్య భర్తలు), మలుపల్లికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ భ్యాగరి లక్ష్మణ్‌తో పాటు భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దుబ్బాక ఉప ఎన్నికల మిరుదొడ్డి మండల ఇన్చార్జి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రజల కొరకు ఏ ఒక్కటైన మంచి పనిని చేసిందా..? అంటూ ప్రశించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టకున్నా ఆ పార్టీల నాయకులైన కిషన్‌రెడ్డికి, జానారెడ్డికి మాత్రం అబ్ధి చేకూరిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజార్టీ రావడం ఖాయమమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జెల సాయిలు, పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, టీఆర్ఎస్ మండల సీనియర్ నేతలు సూకురి లింగం, పంజాల శ్రీనివాస్‌గౌడ్, నంట బాపురెడ్డి, సర్పంచ్‌లు ఫోరం మండలాధ్యక్షుడు తుమ్మల బాల్‌రాజు, సర్పంచ్‌లు రాములు, చుక్క శంకర్, వెంకట్‌రెడ్డి, ఆయా గ్రామాల పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లోకి..
తొగుట: సమైక్యాంధ్రలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పారదర్శక పాలనతో ఎంతో అభివృద్ధిని సాధించామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లికి చెందిన కాన్గల్ ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ ఎన్నం మహిపాల్‌రెడ్డి, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నీల రాములుతో సహా సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ గాంధారి లత నరేందర్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర కమిటీ సభ్యులు దేవి రవీందర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కంకణాల నర్సింహులు, రైతుబంధు మండలాధ్యక్షుడు బోధనం కనకయ్య, నాయకులు ఎండీ ఖలీమోద్దీన్, నాగరాజు, లక్ష్మారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.