సోమవారం 26 అక్టోబర్ 2020
Siddipet - Oct 01, 2020 , 00:06:22

మైనార్టీలకు ప్రాధాన్యం

మైనార్టీలకు ప్రాధాన్యం

  • నార్సింగి మండల ఇన్‌చార్జి, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

చేగుంట: తెలంగాణలో బడుగుబలహీన వర్గాలతో పాటు మైనార్టీలకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత కల్పించారని నార్సింగి మండల ఇన్‌చార్జి, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. నార్సింగి చంద్రరెడ్డి గార్డెన్‌లో బుధవారం  మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రెండు వందల మంది మైనార్టీ నాయకులు భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దుబ్బాక నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం ప్రకటించే అభ్యర్థికి అండగా ఉండి లక్ష మోజార్టీ ఓట్లతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబిత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎర్రం అశోక్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తౌర్యనాయక్‌, ఎంపీటీసీ ఆకుల సుజాత, సీనియర్‌ నాయకులు శ్రీపతిరావు, టెలీకాం బోర్డు మాజీ సభ్యులు అంచనూరి రాజేష్‌, మాజీ వైస్‌ ఎంపీపీ ఆకుల మల్లేశంగౌడ్‌, రబ్బాని తదితరులున్నారు.logo