సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

కొండపాక: మండల పరిధిలోని మంగోలుకు చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి మంగళవారం చెక్కులు అందజేశారు. గ్రామానికి చెందిన శిరీష అనే యువతి అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా, సీఎం సహాయనిధి నుంచి రూ.28వేలు మంజూరు కాగా, ఎంపీ శిరీష కుటుంబ సభ్యులకు చెక్కును ఆయన అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్‌కుమార్, ఎంపీటీసీ సభ్యురాలు హరిత, ఉప సర్పంచ్ కల్పనకనకరాజు, టీఆర్ఎస్ నాయకులు కనకయ్య, కో ఆప్షన్ సభ్యులు కనకయ్య తదితరులున్నారు.
వర్గల్లో..
వర్గల్: సామలపల్లిలో అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్న కొండయ్యకు మంగళవారం టీఆర్ఎస్ వర్గల్ మండల ఉపాధ్యక్షుడు చితంల శ్రీశైలంముదిరాజ్, ఎంపీపీ లతారమేశ్గౌడ్తో కలిసి ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ రూ.60 వేల చెక్కును వారు అందజేశారు. వారివెంట సర్పంచ్ సత్తవ్వ, ఉపసర్పంచ్ కనకరాజుగౌడ్, టీఆర్ఎస్ నాయకులు గణేశ్, ఎర్ర గోపాల్, భిక్షపతి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్‌లో..
దౌల్తాబాద్: సూరంపల్లికి చెందిన బాధితులు అల్లీమల్లి అర్జున్‌కు రూ.60వేలు, బొల్లం వినయ్‌కుమార్‌కు రూ.16 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం టీఆర్ఎస్ మండల నాయకుడు మూత్యాల శ్రీనివాస్ అందజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆయా చెక్కులను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు అందజేశామని తెలిపారు.
తాజావార్తలు
- త్వరలో టీటీడీ నుంచి గో ఉత్పత్తులు : ఈఓ
- సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ సమర్పించిన ఎన్సీబీ
- శర్వానంద్‌కు టాలీవుడ్ స్టార్స్ సాయం...!
- గోల్డ్ స్మగ్లింగ్ కేసు : సంచలన విషయాలు వెల్లడించిన స్వప్నా సురేష్!
- ఐసీఐసీఐ హోమ్‌లోన్‌పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు