మంగళవారం 20 అక్టోబర్ 2020
Siddipet - Sep 29, 2020 , 02:12:13

కురుమలు విద్యలోనూ రాణించాలి

కురుమలు విద్యలోనూ రాణించాలి

  • దుబ్బాకలో కురుమ సంఘ నాయకులు ఏకగ్రీవ తీర్మానం అందజేత

దుబ్బాక :   గొల్ల కురుమలు విద్యలో రాణిస్తే అన్ని  రంగాల్లో రాణించగలరని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారులో గొల్లకురుమలకు సముచిత న్యాయం చేకూరిందన్నారు. ఆదివారం రాత్రి  దుబ్బాకలో గొల్లకురుమలు మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు. కురుమ సంఘం భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రికి ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందజేశారు. తామంతా ముందు నుంచి టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నామని గొల్లకురుమ సంఘం ప్రతినిధులు ప్రకటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గొర్ల మందలు, బంగారం మాత్రమే సంపద కాదని విద్య తరగని ఆస్తి అని  సూచించారు. దుబ్బాకలో కురుమ సంఘం భవనానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రొట్టే రాజమౌళి, మున్సిపల్‌ చైర్మన్‌ గన్నె వనిత, కౌన్సిలర్‌ బట్టు యాదమ్మ నాయకులు ఎల్లం రాజు ఉన్నారు.

 కుల సంఘాల భవనాలకు ప్రొసీడింగ్స్‌ 

దుబ్బాక రెడ్డి సంఘం భవనంలో ఆదివారం రాత్రి పలు కుల సంఘాల నాయకులతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాకలోని విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, కుమ్మరి, దర్జీ(టైలర్‌), ఫొటో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ భవనాలకు ప్రొసీడింగ్‌ పత్రాలను మంత్రి అందజేశారు.  


logo