మంగళవారం 20 అక్టోబర్ 2020
Siddipet - Sep 29, 2020 , 02:12:15

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

  • n టీఆర్‌ఎస్‌లోకి టీజేఎస్‌ దుబ్బాక నియోజకవర్గ  కన్వీనర్‌  చిందం రాజ్‌కుమార్‌ 
  • n 10వ వార్డు కౌన్సిలర్‌ బంగారయ్య  మంత్రి సమక్షంలో చేరిక

దుబ్బాక : రాష్ట్రంలో  సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌, బీజేపీ, టీజేఎస్‌ నాయకులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సోమవారం దుబ్బాక రెడ్డి సంఘంలో టీజేఎస్‌ దుబ్బాక నియోజకవర్గ కన్వీనర్‌ చిందం రాజ్‌కుమార్‌ తన అనుచరులతోపాటు దౌల్తాబాద్‌ మండలంలోని కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ కండువా వేసుకున్నారు. లచ్చపేటకు చెందిన 10వ వార్డు కౌన్సిలర్‌ కూరపాటి బంగారయ్యతో పాటు ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఎస్సీ కార్పొరేషన్‌ లబ్ధిదారులకు చెక్కులు అందజేత 

నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన రూ. 2కోట్లు ప్రొసీడింగ్‌ పత్రాలను లబ్ధిదారులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అందజేశారు. దుబ్బాక ప్రెస్‌క్లబ్‌ భవనానికి రూ.25లక్షలు, పద్మశాలీ భవనానికి రూ. 50 లక్షలు ప్రొసీడింగ్‌ పత్రాలు అందజేశారు. మున్సిపాలిటీలో లచ్చపేటకు రూ. కోటి, దుంపలపల్లికి రూ. కోటి, చెల్లాపూర్‌కు రూ.60 లక్షలు మంజూరుకు హామీ ఇచ్చారు. నిధులతో కుల సంఘాల భవనాలు, అంతర్గత సీసీ రోడ్లు  పలు అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి సూచించారు.


logo