మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Sep 28, 2020 , 01:57:40

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

మల్లికార్జునస్వామి ఆలయంలో..

చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని కరీంనగర్‌, హైదరాబాద్‌, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఆలయంలో ఆర్జీత సేవలు నిలిపివేయడంతో భక్తులు స్వామి వారిని దర్శించుకొని  వెళ్లిపోతున్నారు. ఆదివారం సుమారు 7వేల మంది భక్తులు కొమురవెల్లి క్షేత్రానికి వచ్చినట్లు ఆలయ ఏఈవో గంగా శ్రీనివాస్‌ తెలిపారు.

ఏడుపాయలలో...

పాపన్నపేట : ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా నేపథ్యంలో శానిటైజర్‌ వాడుతూ, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈవో సార శ్రీనివాస్‌, సిబ్బంది సిద్దిపేట శ్రీనివాస్‌, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి తదితరులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకున్నారు. వేద బ్రాహ్మణులు నరసింహాచారి, శంకరశర్మ, పార్థివశర్మ, రామశర్మ, రాజశేఖర్‌శర్మ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు బందోబస్తు నిర్వహించారు.


VIDEOS

logo