సోమవారం 26 అక్టోబర్ 2020
Siddipet - Sep 27, 2020 , 02:14:27

ఈ నెల 30న జనగామలో ట్రాక్టర్ల ర్యాలీ

ఈ నెల 30న జనగామలో ట్రాక్టర్ల ర్యాలీ

  • l పట్టణానికి నీటి ముప్పు లేకుండా చర్యలు
  • l ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
  • l పెద్ద చెరువు మత్తడి వద్ద పూజలు

చేర్యాల : సీఎం కేసీఆర్‌ పాలన దేశానికి దిక్సూచని, సంస్కరణలకు తెలంగాణ ఓ ల్యాండ్‌మార్క్‌గా మారిందని, మన పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శనీయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం కురిసిన భారీ వర్షంతో మత్తడి దూకుతున్న చేర్యాల పెద్ద చెరువు మత్తడి వద్ద మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశంతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్ద చెరువు మత్తడి వరద నీటి వల్ల చేర్యాల పట్టణానికి ఎలాంటి ముప్పు కలుగకుండా చెరువు కట్ట పక్క నుంచి ప్రత్యేక కాల్వ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ నెల 30న జనగామ నియోజకవర్గ కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టానికి అభినందనలు తెలియజేస్తూ 2వేల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీకి రైతులు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు పచ్చిమడ్ల సతీశ్‌, మంగోలు చంటి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, పుర్మ వెంకట్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ మంచాల కొండయ్య, యాట భిక్షపతి, వడ్లకొండ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కొమురవెల్లి : పేదల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం కొమురవెల్లి మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో లబ్ధిదారులకు ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, తహసీల్దార్‌ శైలజలతో కలిసి ఎమ్మెల్యే 67 కల్యాణలక్ష్మి చెక్కులు, 156 రైతు పాస్‌బుక్‌లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో సభలో ఉన్న మహిళలు, రైతులు సీఎం కేసీఆర్‌కు రెండు చేతులతో దండం పెడుతూ దీవెనలు అందించారు. అనంతరం తపాస్‌పల్లి కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షుడు ఈగ ప్రకాశ్‌ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌  పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, వైస్‌ ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, కొమురవెల్లి సర్పంచ్‌ సార్ల లత, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సద్ది కృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బచ్చల సాయిమల్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ వంగా చంద్రారెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బత్తిని నర్సింహులుగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు పుట్ట కనకరాజు పాల్గొన్నారు. 


logo