మంగళవారం 20 అక్టోబర్ 2020
Siddipet - Sep 27, 2020 , 02:14:28

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

  • l కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలో సంబురాలు 
  • l కేంద్రం తెచ్చిన వ్యవసాయబిల్లుతో   దేశంలో నిరసనలు 
  • l అభివృద్ధి చేసే పార్టీకే ప్రజల మద్దతు 
  • l ఎన్నికల ముందు వచ్చే పార్టీలను నమ్మొద్దు 
  • l చేగుంటలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు 
  • l మంత్రి,ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో   600 మంది టీఆర్‌ఎస్‌లో చేరికలు

చేగుంట : టీఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా చేగుంటలో శనివారం టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీల నుంచి 600లకు పైగా టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో రైతులు సంబురాలు నిర్వహించుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు కీడుచేస్తాయన్నారు.  దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి తీరని లోటన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. చేగుంటలో షాదీఖాన నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని, గిరిజన తండాల్లో రోడ్ల సౌకర్యంతో పాటు ఇల్ల్లులేని వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, చేగుంట మండల ఇన్‌చార్జి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి  అన్నారు. దుబ్బాక నుంచి పోటీచేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక ..

చేగుంట మాజీ జడ్పీటీసీ ఆకుల సిద్దిరాములు. చేగుంట మాజీ  వైఎస్‌ ఎంపీపీ ఆకుల మల్లేశం, నార్సింగి ఎంపీటీసీ ఆకుల సుజాత, బి-కొండాపూర్‌ సర్పంచ్‌ బాల్‌నర్సింహులు, రాంపూర్‌ ఉప సర్పంచ్‌ బిస్కి స్వామితో పాటు చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన 600 మందికి పైగా మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్‌రావు, చేగుంట, నార్సింగి ఎంపీపీలు మాసుల శ్రీనివాస్‌, చిందం సబిత, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్‌, బాణాపురం కృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజనక్‌ ప్రవీణ్‌కుమార్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్‌, ఎర్రం అశోక్‌, సొసైటీ చైర్మన్లు వంటరి కొండల్‌రెడ్డి, మ్యాకల పరమేశ్‌, ఆకుల మల్లేశంగౌడ్‌, తౌర్యనాయక్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం  

పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం చేగుట ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన లబ్ధిదారులకు 112 కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. చేగుంట 167 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.4.56 కోట్లు, నార్సింగి మండలంలోని 105 సంఘాలకు గాను రూ.2.25 కోట్ల చెక్కులను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌, నార్సింగి జడ్పీటీసీ కృష్ణారెడ్డి, తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌, ఏపీడీ భీమయ్య, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి, ఏపీఎంలు లక్ష్మీనర్సమ్మ, రుక్మిణి, సీఏలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 


logo