మంగళవారం 27 అక్టోబర్ 2020
Siddipet - Sep 26, 2020 , 02:08:46

గొల్లకుర్మలకు అండగా ప్రభుత్వం

గొల్లకుర్మలకు అండగా ప్రభుత్వం

  • సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

మిరుదొడ్డి : రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఉప ఎన్నికల ఇన్‌చార్జి చింతా ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలో అల్వాల గ్రామంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, భూంపల్లి గ్రామంలో గొల్లకుర్మ సంఘం సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. అభివృద్ధిని కోరేవారందరూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సమావేశంలో ఎంపీపీ గజ్జెల సాయిలు, పీఏసీఎస్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు సూకూరి లింగం, బాల్తె వెంకటేశం, కార్యకర్తలు పాల్గొన్నారు.logo